రథ సప్తమి. ఈ రోజు సూర్య భగవానుడి జన్మదినం.
ఈ రోజు ఎవరెవరి ఆచారాలననుసరించి రథాన్ని తయారు చేస్తారు. చిక్కుడు కాయలతో ఇలా రథాన్ని తయారు చెయ్యడం ఒక ఆచారం.
ఈ రోజును ఆరోగ్య సప్తమి అనికూడా అంటారు. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. మన శరీరానికి కావలసిన విటమిన్ D ఉచితంగా సూర్య కిరణాల వల్ల కలుగుతుంది.అందుకే డాక్టర్స్ కూడా కాసేపు ఎండలో ఉదయాన్నే కూర్చో మంటారు. ఉదయాన్నే ఎవరు వచ్చినా రాకపోయినా సూర్యుడుఖచ్చితంగా వస్తాడు. మన రోజు మొదలవ్వాలి అంటే సూర్యుడు రావాలి. అలాంటి సూర్య భగవానుడి రథసప్తమి రోజున ఒక్క నమస్కారం.