ఖైరతాబాద్ గణేష్, భారతదేశంలోని, హైదరాబాద్ ఖైరతాబాద్ లో గణేష్ చతుర్థి సమయంలో ప్రతిష్టించబడిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహం.
1954లో బాల గంగాధర్ తిలక్ చేసిన విజ్ఞప్తి నుండి ప్రేరణ పొందిన ఎస్ శంకరయ్య ఖైరతాబాద్ వద్ద ఒక అడుగు విగ్రహంతో ప్రారంభించారు.
అప్పటి నుండి ఎస్ సుదర్శన్ తన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం
అతను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఫౌండర్ కమ్ ఆర్గనైజర్.
ప్రతీ ఏటా ఒక్కో అడుగు పెంచుకుంటూ వస్తారు. 2014లో 60 అడుగుల ఎత్తులో షష్టిపూర్తి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరోనా ప్రభావం తీవ్ర ప్రభావం చూపడంతో 2020 లో 9 అడుగుల విగ్నేశ్వరుని ఏర్పాటుచేసి ఉన్నచోటనే నిమజ్జనంచేసేలా చూశారు. ఈసారి మాత్రం 40 అడుగుల ఎత్తు, 27 అడుగుల వెడల్పు, 28 టన్నుల బరువున్న వినాయకుడిని నిలబెట్టారు.