దేవీ భాగవతంలో బ్రహ్మ ,విష్ణు, మహేశ్వరులైన త్రిమూర్తుల కన్నా అమ్మవారికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు. శక్తిస్వరూపిణి నుంచే సృష్టి, స్థితి, లయకారకులైన త్రిమూర్తులు ఉద్భవించినట్టు పురాణాలు చెబుతున్నాయి.
శరన్నవరాత్రులు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు పరమేశ్వరి తొమ్మిది అవతారాలను ఆరాధిస్తారు. 

నవరాత్రుల ఉత్సవాల్లో అమ్మవారిని రోజుకో రూపంలో అలకరించి, నైవేద్యాలను కూడా ఒక్కో వంటకం సమర్పిస్తారు.

మొదటి రోజు- అమ్మవారు శైలపుత్రి అలంకారంలో దర్శనమిస్తుంది. దుర్గాదేవికి నైవేద్యంగా కట్టె పొంగలి సమర్పిస్తారు.

రెండవ రోజు- అమ్మ బాలా త్రిపుర సుందరి అంటే బ్రహ్మచారిణి అలంకారంలో భక్తులను అనుగ్రహిస్తుంది. నైవేద్యంగా పులిహోర సమర్పిస్తారు.

మూడవ రోజు- చంద్రఘంటా అంటే గాయత్రీదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా కొబ్బరి అన్నం, పాయసం సమర్పిస్తారు.

నాల్గవ రోజు- అన్నపూర్ణదేవిగా అలంకారంలో భక్తులను అనుగ్రహించే పరా శక్తికి మినప గారెలు నైవేద్యం సమర్పిస్తారు.

అయిదవ రోజు- లలితా దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తుంది. నైవేద్యంగా దద్ద్యోజనం సమర్పిస్తారు.

ఆరవ రోజు- మహాలక్ష్మీగా అలంకరిస్తారు. నైవేద్యంగా కేసరి సమర్పిస్తారు

యేడవ రోజు- సరస్వతి రూపంలో జగన్మాత దర్శనమిస్తుంది. నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు.

ఎనిమిదవ రోజు- దుర్గాదేవి రూపంలో అలంకరిస్తారు. నైవేద్యంగా శాకాన్నం లేదా కలగూర పులుసు సమర్పిస్తారు.

తొమ్మిదో రోజు- మహిషాసురమర్దినిగా అమ్మవారిని అలంకరిస్తారు. నైవేద్యంగా రవ్వతో చక్రపొంగలి, చక్కర పొంగల్ సమర్పిస్తారు.

పదో రోజు- శ్రీరాజరాజేశ్వరి దేవిగా అలంకరిస్తారు. నైవేద్యంగా సేమ్యా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నం సమర్పిస్తారు.