లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్

 

అమ్మవారు ప్రదేశం  
శాంకరి శ్రీలంక  
కామాక్షి కాంచీపురం, తమిళనాడు మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.
శృంఖల ప్రద్యుమ్న నగరం, పశ్చిమ బెంగాల్ ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.
చాముండి క్రౌంచ పట్టణము, మైసూరు, కర్ణాటక అమ్మవారు చాముండేశ్వరీ దేవి.
జోగులాంబ ఆలంపూర్, తెలంగాణ కర్నూలు నుండి 27 కిలోమీటర్ల దూరంలో ‘తుంగభద్ర’ & Krishna నదులు కలిసే స్థలంలో ఉంది.
భ్రమరాంబిక శ్రీశైలం, ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా నదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతులై ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కుడా ఒకటి.
మహాలక్ష్మి కొల్హాపూర్, మహారాష్ట్ర ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.
ఏకవీరిక మాహుర్యం లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర ఇక్కడి అమ్మవారిని ‘రేణుకా మాత’గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతను దర్శించుకొనవచ్చును.
మహాకాళి ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.
పురుహూతిక పీఠిక్య లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.
గిరిజ ఓఢ్య, జాజ్‌పూర్ నుండి 20 కిలోమీటర్లు, ఒడిషా వైతరిణీ నది తీరాన ఉంది.
మాణిక్యాంబ దక్షవాటిక లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ కాకినాడనుండి 20 కిలోమీటర్ల దూరంలో.
కామరూప హరిక్షేత్రం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం బ్రహ్మపుత్రా నది తీరంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.
మాధవేశ్వరి ప్రయాగ (అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపంలో ఈ అమ్మవారిని అలోపీ దేవి అని కూడా అంటారు.
వైష్ణవి జ్వాలాక్షేత్రం, [3] కాంగ్రా వద్ద, హిమాచల్ ప్రదేశ్ ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడు జ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.
మంగళ గౌరి గయ, బీహారు పాట్నా నుండి 74 కిలోమీటర్లు.
విశాలాక్షి వారాణసి, ఉత్తర ప్రదేశ్.  
సరస్వతి జమ్ము, కాష్మీరు అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలోఉందంటారు.

Comments are closed.