salt hand

ఉప్పు చేతికి ఇవ్వకూడదు అని చాలా మంది పెద్దలు చెబుతుంటారు. అందుకు కొన్ని సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

అమ్మమ్మలు, నాయనమ్మల కాలం వాళ్లు చెప్పేవి మనకు చెవికి ఎక్కవు. ఏ జాగ్రత్త చెప్పినా సరే. ఇదంతా చాదస్తం అని కొట్టి పారేస్తారు. కానీ ఆ కాలం వాళ్లు తెలియకుండానే ఎన్నో సమస్యల నుంచి బయటపడ్డారు. అందుకు ఇప్పుడు చాదస్తం అనుకుంటున్న ఈ జాగ్రత్తలే.

సైన్స్ పెద్దగా డెవలప్ కాని ఆ రోజుల్లోనూ వాళ్లు అన్ని విధాలుగా ఆరోగ్యంగా, సౌకర్యంగా బతకగలిగారు. అంటే. వాళ్ల మేధస్సు వాళ్లని అలా కాపాడింది. అయితే వాళ్లు చెప్పే కొన్ని జాగ్రత్తలను ఈ తరాల వారు పట్టించుకోవడం లేదు. అందులో ఓ విషయం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఇంట్లో ఎవరైనా ఉప్పు చేతికి ఇస్తుంటే వెంటనే పెద్ద వాళ్లు వారిస్తారు. అలా ఇవ్వకూడదు అని. ఇందులో ఏముందిలే అని లైట్ తీసుకుంటారు కానీ దీని వెనకాల శాస్త్రీయ కారణాలున్నాయి. అంతే కాదు. అంతకు మించి ఆరోగ్యాన్ని కాపాడుకునే ముందు జాగ్రత్త ఉంది. ఆ వివరాలు తెలుసుకుందాం.

మొదటి కారణం

ఉప్పు చేతికి ఇవ్వకూడదు అని చెప్పడానికి ప్రధాన కారణాలేంటో చూద్దాం. ఉప్పులో తేమను పీల్చుకునే గుణం ఎక్కువగా ఉంటుంది. దీన్నే హైగ్రోస్కోపిక్ అంటారు. గాలిలో ఉండే తేమను గ్రహించి వాటిని కూడా కలిపేసుకుంటుందిఅయితే ఉప్పు చేతికి ఇవ్వకూడదు అనడానికి ఈ గుణమే కారణం. సాధారణంగా చేతిలో రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి. చెమట ఉంటుంది. దీంతో పాటు ఎంతో కొంత తడి ఉంటుంది. ఎప్పుడైతే చేతితో ఉప్పు ఇవ్వడానికి ప్రయత్నిస్తారో అప్పుడు చేతిలో ఉన్న ఆ తేమ అంతా ఉప్పు పీల్చుకుంటుంది. అలాంటి ఉప్పుని వాడడం అనారోగ్యకరం. అందుకే పొరపాటున కూడా చేతితో ఉప్పుని మరో వ్యక్తికి ఇవ్వకూడదు అని పెద్దలు వారిస్తుంటారు.

ఇక మరి కొన్ని కారణాలు కూడా తెలుసుకుందాం.

మీరు ఎప్పుడైనా గమనించారా. కొంత మందికి ఆఫీస్ లో కానీ, ఇంట్లో కానీ ఏదైనా ఐరన్ వస్తువులు ముట్టుకున్నప్పుడు లేదా ఇంకెవరినైనా తాకినప్పుడు సడెన్ గా కరెంట్ షాక్ కొట్టినట్టుగా అవుతుంది. ఒళ్లంతా జల్లుమంటుంది. స్టాటిక్ ఎలక్ట్రిసిటీ కారణంగా ఇలా జరుగుతుంది. వాతావరణం మరీ పొడిగా ఉన్నప్పుడు లేదా సింథటిక్ క్లాథ్ తో తయారు చేసిన దుస్తులు ధరించినప్పుడు కూడా షాక్ కొడుతుంది. శరీరంలో ఈ విద్యుత్ సహజంగానే ఏర్పడుతుంది. అయితే ఉప్పుని చేతి నుంచి మరో చేతికి ఇచ్చినప్పుడు ఉన్నట్టుంది ఈ స్టాటిక్ ఎలక్ట్రిసిటీ పుట్టే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఒక్కసారిగా షాక్ కొట్టినట్టుగా అవుతుంది. కొన్ని సార్లు నిప్పు రవ్వలు వచ్చే ముప్పు కూడా ఉంటుంది. ఇది చాలా అరుదుగా జరిగినప్పటికీ పెద్దలు మాత్రం ఈ జాగ్రత్త తప్పకుండా పాటించాలని చెబుతుంటారు.

ముఖ్య గమనిక

ఇక్కడ మనం గమనించాల్సింది ఏమిటి అంటే ఉప్పు అందించడం అంటే నేరుగా ఉప్పుని చేతితో తీసుకొని ఇవ్వడం. పాతరోజుల్లో ఇప్పటిలాగా చిన్న చిన్న డబ్బాలు స్పూన్ లు లేవు. అందుకే ఉప్పు ఒక పెద్ద డబ్బాలో ఉండేది. అందులోంచే తీసేవారు. కానీ ఇప్పుడు డబ్బాలు స్పూన్ లు వచ్చాయి. కనుక ఇప్పుడు ఉప్పు అందించడం పాతరోజుల్లో ఉప్పు అందించడం వ్యత్యాసం గమనించాలి

ఈ కావ్యం నచ్చితే నలుగురికి షేర్ చెయ్యండి.

నమస్తే 🙏