ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ||

ఓం అథ పురుషో హ వై నారాయణోఽకామయత ప్రజాః సృజేయేతి |
నారాయణాత్ప్రాణో జాయతే | మనః సర్వేన్ద్రియాణి చ |
ఖం వాయుర్జ్యోతిరాపః పృథివీ విశ్వస్య ధారిణీ |
నారాయణాద్-బ్రహ్మా జాయతే |
నారాయణాద్_రుద్రో జాయతే |
నారాయణాదిన్ద్రో జాయతే |
నారాయణాత్ప్రజాపతయః ప్రజాయన్తే |
నారాయణాద్ద్వాదశాదిత్యా రుద్రా వసవస్సర్వాణి
చ ఛన్దాగ్ంసి |
నారాయణాదేవ సముత్పద్యన్తే |
నారాయణే ప్రవర్తన్తే |
నారాయణే ప్రలీయన్తే ||

ఓం | అథ నిత్యో నారాయణః | బ్రహ్మా నారాయణః |
శివశ్చ నారాయణః | శక్రశ్చ నారాయణః |
ద్యావాపృథివ్యౌ చ నారాయణః | కాలశ్చ నారాయణః |
దిశశ్చ నారాయణః | ఊర్ధ్వశ్చ నారాయణః |
అధశ్చ నారాయణః | అన్తర్బహిశ్చ నారాయణః |
నారాయణ ఏవేదగ్ం సర్వమ్ |
యద్_భూతం యచ్చ భవ్యమ్ |
నిష్కలో నిరఞ్జనో నిర్వికల్పో నిరాఖ్యాతః శుద్ధో దేవ
ఏకో నారాయణః | న ద్వితీయోస్తి కశ్చిత్ |
య ఏవం వేద |
స విష్ణురేవ భవతి స విష్ణురేవ భవతి ||

ఓమిత్యగ్రే వ్యాహరేత్ | నమ ఇతి పశ్చాత్ |
నారాయణాయేత్యుపరిష్టాత్ |
ఓమిత్యేకాక్షరమ్ | నమ ఇతి ద్వే అక్షరే |
నారాయణాయేతి పఞ్చాక్షరాణి |
ఏతద్వై నారాయణస్యాష్టాక్షరం పదమ్ |
యో హ వై నారాయణస్యాష్టాక్షరం పదమధ్యేతి |
అనపబ్రవస్సర్వమాయురేతి |
విన్దతే ప్రాజాపత్యగ్ం రాయస్పోషం గౌపత్యమ్ |
తతోఽమృతత్వమశ్నుతే తతోఽమృతత్వమశ్నుత ఇతి |
య ఏవం వేద ||

ప్రత్యగానన్దం బ్రహ్మ పురుషం ప్రణవస్వరూపమ్ |
అకార ఉకార మకార ఇతి |
తానేకధా సమభరత్తదేతదోమితి |
యముక్త్వా ముచ్యతే యోగీ జన్మసంసారబన్ధనాత్ |
ఓం నమో నారాయణాయేతి మన్త్రోపాసకః |
వైకుణ్ఠభువనలోకం గమిష్యతి |
తదిదం పరం పుణ్డరీకం విజ్ఞానఘనమ్ |
తస్మాత్తదిదావన్మాత్రమ్ |
బ్రహ్మణ్యో దేవకీపుత్రో బ్రహ్మణ్యో మధుసూదనోమ్ |
సర్వభూతస్థమేకం నారాయణమ్ |
కారణరూపమకార పరబ్రహ్మోమ్ |
ఏతదథర్వ శిరోయోఽధీతే ప్రాతరధీయానో
రాత్రికృతం పాపం నాశయతి |
సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి | మాధ్యన్దినమాదిత్యాభిముఖోఽధీయానః
పఞ్చపాతకోపపాతకాత్ప్రముచ్యతే |
సర్వ వేద పారాయణ పుణ్యం లభతే |
నారాయణసాయుజ్యమవాప్నోతి నారాయణ సాయుజ్యమవాప్నోతి |
య ఏవం వేద | ఇత్యుపనిషత్ ||

ఓం సహ నావవతు | సహ నౌ భునక్తు |
సహ వీర్యం కరవావహై |
తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ||
ఓం శాంతిః శాంతిః శాంతిః ||

నారాయణ ఉపనిషత్ భావము

ఓం శ్రీ నారాయణాయ నమో నమ:

1.నారాయణుడే ఆది పురుషుడు. ఇది సత్యము.నారాయణునకు ప్రజలను సృష్టించవలెనను కోరిక కలిగినది .

అపుడు మొదటగా నారాయణుని నుండి ప్రాణము(ప్రాణవాయువు)ఉద్భవించినది.ఆ తరువాత మనస్సు,ఇంద్రియములు,మరియు ఆకాశము,వాయువు, అగ్ని,జలము,భూమి వీటన్నింటికీ అధారమైన విశ్వము ఉద్భవించినవి.

నారాయణుని నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ప్రజాపతులు ఉద్భవించిరి.నారాయణుని నుండి ఆదిత్యులు(12) రుద్రులు(11) వసువులు(8) ఉద్భవించిరి.మరియు వేద చందస్సు ఉద్భవించినది. ఇవన్నియూ నారాయణుని యందే పుట్టుచున్నవి.ప్రవర్తిల్లుచున్నవి. నారాయణునియందే విలీనమగుచున్నవి. ఇది ఋగ్వేద ఉపనిషత్తు.

2.నారాయణుడు శాశ్వతుడు. నారాయణుడే బ్రహ్మ. నారాయణుడే శివుడు. నారాయణుడే ఇంద్రుడు. నారాయణుడే కాలుడు(మృత్యుదేవత).నారాయణుడే ఉర్ధ్వ-అధోదిక్కులు.లోపల వెలుపల (శరీరములోనున్న-బయటనున్న)ఉన్నది నారాయణుడే. సర్వము నారాయణుడే.ఇది సత్యము. భూతభవిష్యత్ వర్తమానములు నారాయణుడే. విభాగములు లేక ఒక్కటిగా నున్నది నారాయణుడే.

సర్వమునకు ఆధారభూతుడు,దోషరహితుడు,భావింపశక్యముకానివాడు,వర్ణింపనలవికానివాడు, పవిత్రుడు, దివ్యుడు అయిన దేవుడు నారాయణుడు ఒక్కడే. ఆ నారాయణుడే విష్ణువు. ఆ నారాయణుడే సర్వవ్యాపి అయిన విష్ణువు. ఇది యజుర్వేద ఉపనిషత్తు.

3.”ఓం” అని మొదటగా ఉచ్చరించవలెను. తరువాత “నమ:” అని ఉచ్చరించవలెను.తరువాత “నారాయణాయ” అని ఉచ్చరించవలెను.”ఓం” అనునది ఏకాక్షరము.”నమ:”అనునది రెండక్షరములు. “నారాయణాయ”అనునది ఐదక్షరములు.ఈ విధముగా నారాయణుడు “ఓం నమో నారాయణాయ”అను అష్టాక్షరి మంత్రముగా రూపుదిద్దుకొనినాడు.

ఈ అష్టాక్షరి మంత్రమును పఠించుట వలన సర్వారిష్టములు తొలగును.సంపూర్ణ ఆయురారోగ్యములు సిద్ధించును.

సంతానము, యశస్సు, ధనము, గోగణములు వృద్ధి చెందును. ఆ తరువాత అమృతత్వము(ముక్తి)సిద్ధించును.ఇది సత్యము. ఇది సామవేద ఉపనిషత్తు.

4.పురుషుడైన నారాయణుని ప్రణవస్వరూపమైన ఓంకారమును పఠించుట వలన సంపూర్ణమైన ఆనందం కలుగును.ఓంకారము అకార,ఉకార,మకారములతో ఏర్పడినది.ఎవరు సదా ఓంకారమును ఉచ్చరింతురో వారు(యోగి)జన్మసంసార బంధముల నుండి విముక్తులగుదురు.”ఓం నమో నారాయణాయ” అను ఈ అష్టాక్షరీ మంత్రమును ఎవరు ఉపాసింతురో వారు శ్రీమన్నారాయణుని వైకుంఠమునకు చేరుదురు.అది పరమ పురుషుని హృదయకమలం.అది ఇంద్రియాతీతమైన విజ్ఞానముతో నిండియున్నది.ఆ కారణముచే ప్రకాశించుచున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *