రథయాత్రకు అరవై రోజుల ముందు, వైశాఖ బహుళ విదియనాడు పనులు మొదలవుతాయి. పూరీ మహారాజు పూజారుల్ని పిలిపించి, కలప సేకరించాల్సిందిగా ఆదేశిస్తాడు. సామంతరాజు దసపల్లా అప్పటికే అందుకు అవసరమైన వృక్షాల్ని గుర్తించి ఉంటాడు. వాటికి వేదపండితులు శాంతి నిర్వహిస్తారు.

  1. 1,072 చెట్ల కాండాలను తయారు చేస్తారు.
  2. రథాల నిర్మాణానికి 13 వేల ఘనపుటడుగుల కలప అవసరం.
  3. అక్షయ తృతీయనాడు రథాల తయారీకి శ్రీకారం చుడుతుంది.
  4. వృక్ష కాండాల్ని 2,188 ముక్కలు చేస్తారు.
  5. 832 ముక్కల్ని జగన్నాథుడి రథం కోసం
  6. 763 ముక్కల్ని బలభద్రుడి రథం కోసం
  7. 593 ముక్కల్ని సుభద్రాదేవి రథం కోసం వినియోగిస్తారు.
  8. తయారీలో ఎక్కడా యంత్రాల్ని వాడరు.
  9. జగన్నాథుడి రథం నందిఘోష.
  10. ఎత్తు సుమారు 46 అడుగులు,
  11. పదహారు చక్రాలుంటాయి.
  12. ఒక్కో చక్రం ఎత్తూ ఆరు అడుగులు.
  13. సారథి పేరు దారుక.
  14. బలభద్రుడి రథం తాళధ్వజం.
  15. సుభద్రాదేవి రథం దేవదళన్‌.