ప్రముఖ బాలీవుడ్‌ నటుడు దిలీప్‌ కుమార్‌(98) కన్నుమూశారు. బుధవారం ఉదయం 7.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. దిలీప్‌ కుమార్‌ 1922 డిసెంబర్‌ 11న పాకిస్తాన్‌లోని పెషావర్‌లో జన్మించారు. ఆయన అసలు పేరు మహమ్మద్‌ యూసుఫ్‌ ఖాన్‌.

అవార్డులు

  • ఉత్తమ నటుడిగా ఆయనకు 8 సార్లు ఫిల్మ్‌ఫేర్‌ అవార్డులు.
  • 1993లో ఫిలింఫేర్‌ లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌
  • 1994లో దిలీప్‌కుమార్‌ను దాదాసాహెబ్‌ ఫాల్కే
  • 1991లో పద్మభూషణ్‌
  • 2015లో పద్మవిభూషణ్‌ 
  • 1998లో దిలీప్‌కుమార్‌ను నిషాన్‌-ఇ-ఇంతియాజ్‌ అవార్డుతో పాక్‌ ప్రభుత్వం