
శ్రీ వసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం
(ఏ శుభకార్యం, వ్రతం లేదా పూజ ప్రారంభించే ముందు చేయవలసిన ప్రాథమిక పూజ)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ।
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ।
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి ।
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ।
అభిప్సితార్థ సిద్ధ్యర్థం పూజతో యః సురైరపి ।
సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః ॥
దీపారాధన
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షిహ్యవిఘ్నకృత్ ।
యావత్ పూజాం కరిష్యామి తావత్త్వంసుస్థిరో భవ ॥
ఆచమనం
ఓం ఆచమ్య – ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా,
ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః,
ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః,
ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః,
ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః,
ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః,
ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః,
ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః,
ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ।
ఉత్తిష్ఠంతు భూత పిశాచా యే తే భూమిభారకాః ।
యే తేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ॥
ఓం భూర్భువస్సువః ॥ దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః ।
ప్రాణాయామః, సంకల్పం
ఓం భూః | ఓం భువః | ఓం సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓం సత్యం |
ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥
ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ॥
సంకల్పం
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభతిథౌ శోభన, ముహూర్తే ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే స్వగృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరే దక్షిణాయనే శరద్ఋతౌ, ఆశ్వయుజ మాసే, శుక్లపక్షే, (19 అక్టోబర్ 2026 న) దశమి తిథౌ భౌమ(మంగళ) వాసరయుక్తాయాం, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ (మీ గోత్రం పేరు) గోత్రః (మీ పేరు) నామ దేయః ధర్మపత్నీ సమేతః
అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాభయాయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ సరస్వతీ ముద్దిశ్య సరస్వతీ దేవతా ప్రీత్యర్థం కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే –
తదంగత్వేన కలశపూజాం కరిష్యే-కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్యోపరిహస్తనిధాయ ॥
కలశారాధన (కలశ పూజ)
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః ।
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణాస్మృతాః ॥
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా ।
ఋగ్వేదోథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ॥
అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః ।
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ ॥
నర్మదా సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు ॥
ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయ కారకాః ।
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా ।
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥
పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య ॥
(కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ, దేవుడి మీద చల్లి, తమ మీద చల్లుకుని)
అధ శ్రీ హరిద్రా గణపతి పూజాం కరిష్యే
ధ్యానం: శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానం – ధ్యానం సమర్పయామి.
ఆవాహనం: శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి.
ఆసనం: శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి.
పాద్యం: శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం: శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనం: శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి.
మధుపర్కం: శ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి.
పంచామృత స్నానం: శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి.
శుద్ధోదక స్నానం: శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం: శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
ఉపవీతం: శ్రీ మహాగణాధిపతయే నమః ఉపవీతం సమర్పయామి.
గంధం: శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి.
అక్షతలు: శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి.
పుష్ప సమర్పణ: శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాణి సమర్పయామి.
శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః
- ఓం సుముఖాయ నమః
- ఓం ఏకదంతాయ నమః
- ఓం కపిలాయ నమః
- ఓం గజకర్ణకాయ నమః
- ఓం లంబోదరాయ నమః
- ఓం వికటాయ నమః
- ఓం విఘ్నరాజాయ నమః
- ఓం గణాధిపాయ నమః
- ఓం ధూమకేతవే నమః
- ఓం గణాధ్యక్షాయ నమః
- ఓం ఫాలచంద్రాయ నమః
- ఓం గజాననాయ నమః
- ఓం వక్రతుండాయ నమః
- ఓం శూర్పకర్ణాయ నమః
- ఓం హేరంబాయ నమః
- ఓం స్కందపూర్వజాయ నమః
నానా విధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి
ధూపం: ధూపమాఘ్రాపయామి.
దీపం: దీపం దర్శయామి.
నైవేద్యం: నైవేద్యం సమర్పయామి.
స్వర్ణపుష్పం: స్వర్ణ పుష్పం సమర్పయామి
తాంబూలం: తాంబూలం సమర్పయామి.
నీరాజనం: నీరాజనం సమర్పయామి.
మంత్రపుష్పం (వినాయకుడు)
గణాధిప నమస్తుభ్యం ఉమాపుత్ర గజానన,
వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక ।
ఏకదంతం త్రైకవదన తథా మూషిక వాహన
కుమారగురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం ॥
మంత్రపుష్పం సమర్పయామి.
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర ।
యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ॥
అనయా మయా కృత షోడశోపచార పూజాం శ్రీ మహా గణపతి దేవతార్పణమస్తు
సమస్త దురితోప శమనార్థం శ్రీ మహా గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి
(దేవునిపై అక్షతలు తీసుకొని శిరస్సుపై ఉంచాలి)
పసుపు వినాయకుని యథాస్థానం ఉద్వాసయామి
ఓం యథాస్థానం ప్రతిష్ఠాపయామి ।
శ్రీ మహాగణాధిపతయే నమః ।
యథాస్థానం ఉద్వాసయామి ।
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ॥
(పసుపు వినాయకుని పీఠమును మూడు మార్లు కదిపి పక్కన ఉంచవలెను)
షోడశోపచార పూజా ప్రారంభః
పూర్వ సంకల్ప ప్రకారేణ అనంతరం శ్రీ సరస్వతి పూజామారభేత్.
పుస్తకేతు యతో దేవీ క్రీడతే పరమార్థతః ।
తతస్తత్ర ప్రకుర్వీత ధ్యానమావాహనాదికమ్ ॥
ధ్యానమేవం ప్రకుర్యాత్ సాధనో విజితేంద్రియః ।
ప్రణవాసన మారుహ్యాం తదర్థత్వేన నిశ్చితామ్ ॥
ధ్యానం:
అంకుశం చాక్ష సూత్రంచ పాశం వీణాంచ ధారిణీం ।
ముక్తాహారసమాయుక్తాం మోదరూపాం మనోహరామ్ ॥
కృతేన దర్పణాభ్యేన వస్త్రేణోపరిభూషితామ్ ।
సుస్తనీం వేదవేద్యాం చ చంద్రార్ధ కృతశేఖరామ్ ॥
జటాకలాప సంయుక్తాం పూర్ణచంద్రనిభాననామ్ ।
త్రిలోచనాం మహాదేవీం స్వర్ణనూపుర ధారిణీం ॥
కటకై స్స్వర్ణ రత్నాఢ్యై రూర్మికావలయభూషితామ్ ।
కంబుకంఠీం సుతామ్రోష్ఠీం సర్వాభరణ భూషితామ్ ॥
కేయూరై శేఖరాద్యైశ్చ ద్యోతయంతీం జగత్త్రయమ్ ।
శబ్దబ్రహ్మాత్మికాం దేవీం ధ్యానకర్మ సమాహితః ॥
సరస్వత్యై నమః – ధ్యాయామి।
ఆవాహనం:
అత్రాగచ్ఛ జగద్వంద్యే సర్వలోకైక పూజితే ।
మయాకృతాం మిమాం పూజాం గృహాణ జగదీశ్వరి ॥
సరస్వత్యై నమః – ఆవాహయామి।
ఆసనం:
అనేక రత్న సంయుక్తం సువర్ణేన విరాజితం ।
ముక్తామణ్యంచితం చారు చాసనం తే దదామ్యహం ॥
సరస్వత్యై నమః – ఆసనం సమర్పయామి।
పాద్యం:
గంధపుష్పాక్షతై స్సారం శుద్ధతోయేన సంయుతం ।
శుద్ధస్ఫటిక తుల్యాంగి పాద్యం తే ప్రతిగృహ్యతామ్ ॥
సరస్వత్యై నమః – పాద్యం సమర్పయామి।
(అర్ఘ్యం) భక్తాభీష్టప్రదే దేవీ దేవదేవాదివందితే ।
ధాత్రిప్రియే జగద్ధాత్రి దదామ్యర్ఘ్యం గృహాణ మే ॥
సరస్వత్యై నమః – అర్ఘ్యం సమర్పయామి।
(ఆచమనీయం) పూర్ణచంద్ర సమానాభే కోటిసూర్య సమప్రభే ।
భక్త్యా సమర్పితం వాణీ గృహాణాచమనీయకం ॥
సరస్వత్యై నమః – ఆచమనీయం సమర్పయామి।
(మధుపర్కం) కమలభువనజాయే కోటిసూర్య ప్రకాశే ।
విశదశుచివిలాసే కోమలాకారయుక్తే ।
దధిమధుఘృతయుక్తం క్షీరరంభాఫలాఢ్యం ।
సురుచిర మధుపర్కం గృహ్యతాం దేవవంద్య ॥
సరస్వత్యై నమః – మధుపర్కం సమర్పయామి।
(పంచామృతస్నానం) పయోదధిఘృతోపేతం శర్కరామధుసంయుతం ।
పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే ॥
సరస్వత్యై నమః – పంచామృత స్నానం సమర్పయామి।
(శుద్ధోదక స్నానం) గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం ।
శుద్ధోదకమిదం స్నానం గృహాణ విధిపూర్వకం ॥
సరస్వత్యై నమః – శుద్ధోదక స్నానం సమర్పయామి।
(వస్త్రయుగ్మం) శుక్ల వస్త్రద్వయం దేవి కోమలం కుటిలాలకే ।
మయి ప్రీత్యా త్వయా వాణి బ్రహ్మణి ప్రతిగృహ్యతామ్ ॥
సరస్వత్యై నమః – వస్త్రయుగ్మం సమర్పయామి।
(ఆభరణాదీన్) కటకముకుటహారై ర్నూపురై రంగదాన్యా ।
ద్వివిధసుమణియుక్తై రేఖలా రత్నహారైః ॥
కమలదళవిలసే కామదే సంగృహీష్వ ।
ప్రకటిత కరుణార్ద్రే భూషితేః భూషణాని ॥
సరస్వత్యై నమః – ఆభరణాని సమర్పయామి।
(యజ్ఞోపవీతం) శబ్దబ్రహ్మాత్మికే దేవి శబ్దశాస్త్ర కృతాలయే ।
బ్రహ్మసూత్రం గృహాణ త్వం బ్రహ్మశక్రాది పూజితే ॥
సరస్వత్యై నమః – యజ్ఞోపవీతం సమర్పయామి।
(గంధం) చందనాగరు కస్తూరీ కర్పూరాద్యైశ్చ సంయుతం ।
గంధం గృహాణ త్వం దేవి విధిప్రసాదనీ స్తుతే ॥
సరస్వత్యై నమః – గంధం సమర్పయామి।
(అక్షతలు) అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాన్ తండుల నిర్మితాన్ ।
గృహాణ వరదే దేవి బ్రహ్మశక్తి శుభాత్మకాన్ ॥
సరస్వత్యై నమః – అక్షతాన్ సమర్పయామి।
(పుష్పపూజ) మందారాది సుపుష్పైశ్చ మల్లికాభిర్మనోహరైః ।
కరవీరై ర్మనోరమ్యై రకులైః కేతకై శుభైః ।
పున్నాగై ర్జాతికుసుమై ర్మందారైశ్చ సుశోభితైః ।
నీలోత్పలైశ్చ శుభై శ్చంపకైః స్తత్కాల తరుసంభవైః ।
కల్పితాని చ మాలాని గృహాణామరవందితే ॥
సరస్వత్యై నమః – పుష్పైః పూజయామి।
అథాంగ పూజా
- ఓం బ్రహ్మణ్యై నమః — పాదౌ పూజయామి
- ఓం బ్రహ్మణ్యమూర్తయే నమః — గుల్ఫౌ పూజయామి
- ఓం జగత్స్వరూపిణ్యై నమః — జంఘే పూజయామి
- ఓం జగదాద్యాయై నమః — జానునీ పూజయామి
- ఓం చారువిలాసిన్యై నమః — ఊరూ పూజయామి
- ఓం కమలభూమయే నమః — కటిం పూజయామి
- ఓం జన్మహీనాయై నమః — జఘనం పూజయామి
- ఓం గంభీరనాభయే నమః — నాభిం పూజయామి
- ఓం హరిపూజ్యాయై నమః — ఉదరం పూజయామి
- ఓం లోకమాత్రే నమః — స్తనౌ పూజయామి
- ఓం విశాలవక్షసే నమః — వక్షఃస్థలం పూజయామి
- ఓం గానవిచక్షణాయై నమః — కంఠం పూజయామి
- ఓం స్కందప్రపూజ్యాయై నమః — స్కంధౌ పూజయామి
- ఓం ఘనబాహావే నమః — బాహూ పూజయామి
- ఓం పుస్తకధారిణ్యై నమః — హస్తౌ పూజయామి
- ఓం శ్రోత్రియబంధవే నమః — శ్రోత్రే పూజయామి
- ఓం వేదస్వరూపాయై నమః — వక్త్రం పూజయామి
- ఓం సునాసిన్యై నమః — నాసికాం పూజయామి
- ఓం బింబసమానోష్ఠ్యై నమః — ఓష్ఠౌ పూజయామి
- ఓం కమలచక్షుషే నమః — నేత్రే పూజయామి
- ఓం తిలకధారిణ్యై నమః — ఫాలం పూజయామి
- ఓం చంద్రమూర్తయే నమః — చికురాన్ పూజయామి
- ఓం సర్వప్రదాయై నమః — ముఖం పూజయామి
- ఓం శ్రీ సరస్వత్యై నమః — శిరః పూజయామి
- ఓం బ్రహ్మరూపిణ్యై నమః — సర్వాంగాణి పూజయామి
శ్రీ సరస్వత్యష్టోత్తర శత నామావళి
- ఓం సరస్వత్యై నమః
- ఓం మహాభద్రాయై నమః
- ఓం మహామాయాయై నమః
- ఓం వరప్రదాయై నమః
- ఓం శ్రీప్రదాయై నమః
- ఓం పద్మనిలయాయై నమః
- ఓం పద్మాక్ష్యై నమః
- ఓం పద్మవక్త్రాయై నమః
- ఓం శివానుజాయై నమః
- ఓం పుస్తకధృతే నమః
- ఓం జ్ఞానసముద్రాయై నమః
- ఓం రమాయై నమః
- ఓం పరాయై నమః
- ఓం కామరూపాయై నమః
- ఓం మహావిద్యాయై నమః
- ఓం మహాపాతకనాశిన్యై నమః
- ఓం మహాశయాయై నమః
- ఓం మాలిన్యై నమః
- ఓం మహాభాగాయై నమః
- ఓం మహాభుజాయై నమః
- ఓం మహాభోగాయై నమః
- ఓం మహోత్సాహాయై నమః
- ఓం దివ్యాంగాయై నమః
- ఓం సురవందితాయై నమః
- ఓం మహాకాళ్యై నమః
- ఓం మహాపాశాయై నమః
- ఓం మహాకారాయై నమః
- ఓం మహాంకుశాయై నమః
- ఓం సీతాయై నమః
- ఓం విమలాయై నమః
- ఓం విశ్వాయై నమః
- ఓం విద్యున్మాలాయై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం చంద్రికాయ్యై నమః
- ఓం చంద్రవదనాయై నమః
- ఓం చంద్రలేఖావిభూషితాయై నమః
- ఓం సావిత్ర్యై నమః
- ఓం సురసాయై నమః
- ఓం దేవ్యై నమః
- ఓం దివ్యాలంకారభూషితాయై నమః
- ఓం వాగ్దేవ్యై నమః
- ఓం వసుధాయై నమః
- ఓం తీవ్రాయై నమః
- ఓం మహాభద్రాయై నమః
- ఓం మహాబలాయై నమః
- ఓం భోగదాయై నమః
- ఓం భారత్యై నమః
- ఓం భామాయై నమః
- ఓం గోవిందాయై నమః
- ఓం గోమత్యై నమః
- ఓం శివాయై నమః
- ఓం జటిలాయై నమః
- ఓం వింధ్యవాసాయై నమః
- ఓం వింధ్యాచలవిరాజితాయై నమః
- ఓం చండికాయై నమః
- ఓం వైష్ణవ్యై నమః
- ఓం బ్రాహ్మ్యై నమః
- ఓం బ్రహ్మజ్ఞానైకసాధనాయై నమః
- ఓం సౌదామన్యై నమః
- ఓం సుధామూర్త్యై నమః
- ఓం సుభద్రాయై నమః
- ఓం సురపూజితాయై నమః
- ఓం సువాసిన్యై నమః
- ఓం సునాసాయై నమః
- ఓం వినిద్రాయై నమః
- ఓం పద్మలోచనాయై నమః
- ఓం విద్యారూపాయై నమః
- ఓం విశాలాక్షాయై నమః
- ఓం బ్రహ్మజాయాయై నమః
- ఓం మహాఫలాయై నమః
- ఓం త్రయీమూర్త్యై నమః
- ఓం త్రికాలజ్ఞాయై నమః
- ఓం త్రిగుణాయై నమః
- ఓం శాస్త్రరూపిణ్యై నమః
- ఓం శుంభాసురప్రమదిన్యై నమః
- ఓం శుభదాయై నమః
- ఓం సర్వాత్మికాయై నమః
- ఓం రక్తబీజనిహంత్ర్యై నమః
- ఓం చాముండాయై నమః
- ఓం అంబికాయై నమః
- ఓం ముండకాయప్రహరణాయై నమః
- ఓం ధూమ్రలోచనమర్దనాయై నమః
- ఓం సర్వదేవస్తుతాయై నమః
- ఓం సౌమ్యాయై నమః
- ఓం సురాసురనమస్కృతాయై నమః
- ఓం కాలరాత్ర్యై నమః
- ఓం కలాధారాయై నమః
- ఓం రూపసౌభాగ్యదాయిన్యై నమః
- ఓం వాగ్దేవ్యై నమః
- ఓం వరారోహాయై నమః
- ఓం వారాహ్యై నమః
- ఓం వారిజాసనాయై నమః
- ఓం చిత్రాంబరాయై నమః
- ఓం చిత్రగంధాయై నమః
- ఓం చిత్రమాల్యవిభూషితాయై నమః
- ఓం కాంతాయై నమః
- ఓం కామప్రదాయై నమః
- ఓం వంధ్యాయై నమః
- ఓం విద్యాధరసుపూజితాయై నమః
- ఓం శ్వేతాననాయై నమః
- ఓం నీలభుజాయై నమః
- ఓం చతుర్వర్గఫలప్రదాయై నమః
- ఓం చతురాననసామ్రాజ్యై నమః
- ఓం రక్తమధ్యాయై నమః
- ఓం నిరంజనాయై నమః
- ఓం హంసాసనాయై నమః
- ఓం నీలజంఘాయై నమః
- ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
- ధూపం: దశాంగం గుగ్గులోపేతం సుగంధం మనోహరం, ధూపం గృహాణ కల్యాణి భక్తిత్వం ప్రతిగృహ్యతాం ॥ సరస్వత్యై నమః – ధూపమాఘ్రాపయామి।
- దీపం: ఘృతావర్తి సంయుక్తం దీపితం దీపమంబికే, గృహాణ చిత్స్వరూపే త్వం కమలాసనవల్లభే ॥ సరస్వత్యై నమః – దీపం దర్శయామి।
- నైవేద్యం: అపూపాన్ వివిధాన్ స్వాదూన్ శాలిపిష్టోపపాచితాన్, మృదులాన్ గుడసమ్మిశ్రాన్ సర్జిరకమరీచికాన్, కదలీఫలసామ్రాణి చ పక్వాని సుఫలాని చ, కందమూల వ్యంజనాని సోపదంశం మనోహరం, అన్నం చతుర్విధోపేతం క్షీరాన్నం చ ఘృతం దధి, శీతోదకం చ సుస్వాదు సుకర్పూర లాది వాసితం, భక్ష్యభోజ్య సమాయుక్తం నైవేద్యం ప్రతిగృహ్యతాం ॥ సరస్వత్యై నమః – నైవేద్యం సమర్పయామి।
- తాంబూలం: తాంబూలం చ సకర్పూరం పూగనాగదళైర్యుతం, గృహాణ దేవదేవేశి తత్త్వరూపీ నమోస్తుతే ॥ సరస్వత్యై నమః – తాంబూలం సమర్పయామి।
- నీరాజనం: నీరాజనం గృహాణ త్వం జగదానందదాయిని, జగత్తిమిరమార్తాండ మండలే తే నమోనమః ॥ సరస్వత్యై నమః – నీరాజనం సమర్పయామి।
- పుష్పాంజలిః: శారదే లోకమాతస్త్వ మాశ్రితాభీష్టదాయిని, పుష్పాంజలిం గృహాణత్వం మయాభక్త్యా సమర్పితమ్ ॥ సరస్వత్యై నమః – పుష్పాంజలిం సమర్పయామి।
మంత్రపుష్పం
యా కుందేందుతుషారహారధవళా యా శుభవస్త్రావృతా, యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా ॥ యా బ్రహ్మాచ్యుతశంకరప్రభృతిభిర్దేవైః సదా పూజితా, సా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా ॥
సరస్వత్యై నమః – మంత్రపుష్పం సమర్పయామి।
చతుర్దశ ప్రదక్షిణం
పాశాంకుశధరా వాణీ వీణాపుస్తకధారిణీ, మమ వక్త్రే వసేన్నిత్యం దుగ్ధకుందేందునిర్మలా ॥ చతుర్దశ సువిద్యాసు రమతే యా సరస్వతీ, చతుర్దశేషు లోకేషు సా మే వాచి వసేచ్చిరమ్ ॥ పాహిపాహి జగద్వంద్యే నమస్తే భక్తవత్సలే, నమస్తుభ్యం నమస్తుభ్యం నమస్తుభ్యం నమోనమః ॥
సరస్వత్యై నమః చతుర్దశ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి।
ఉపాయనదానం
లడ్డుకాన్ ఘృతసంయుక్తాన్ చతుర్దశ మనోహరాన్, సదక్షిణం సతాంబూల ముత్తమాయ ద్విజాతయే ॥ సరస్వతి నమస్తుభ్యం వరదే భక్తవత్సలే, ఉపాయనం ప్రదాస్యామి విద్యావృద్ధిం కురుష్వ మే ॥
సరస్వత్యై నమః – ఉపాయనదానం సమర్పయామి।
వాయనదానం
భారతీ ప్రతిగృహ్ణాతు భారతీవై దదాతి చ, భారతీ తారకోభాభ్యాం భారత్యైతే నమో నమః ॥
ఇతి పూజావిధానం సమాప్తమ్।
శమీ ప్రార్థన
శమీ శమయ తే పాపం శమీ శత్రువినాశినీ, అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శినీ ॥ శమీం కమలపత్రాక్షీం శమీం కంటకధారిణీం, ఆరోహతు శమీం లక్ష్మీ ధనామాయుష్యవర్ధనీం ॥
శ్రీ సరస్వతీ వ్రతకథారంభము
సూతుండు శౌనకాదులం జూచి యిట్లనియె: మహర్షులారా! ఇంకొక ఉత్తమమైన వ్రతము చెప్పెద వినుండు. ఆశ్వయుజమాస శుక్లపక్ష పాడ్యమి మొదలుకొని తొమ్మిది రాత్రులు దుర్గా లక్ష్మీ సరస్వతులం పూజింపవలయు, లేక మూలానక్షత్రము మొదలుకొనియైన పూజ చేయవలయు. అట్లు చేయుటకు అశక్తుడయెనేని నవమి నాడైనను పూజింపవలయు. మరియు ఈ వ్రతం బాచరించువారు ఇహలోకమున నిరంతరైశ్వర్య సంపన్నులై పరంబున దుర్గాలోకంబు జెందుదురు.
అనిన ఋషివర్యులు సూతుని గాంచి “మహాత్మా! తొల్లి ఈ వ్రతంబు నెవ్వరా చరించి సుఖంబు జెందిరి” అని అడుగగా సూతుండు “మునులారా! కృతయుగంబునందు మహా ధార్మికుండును, ప్రజాపాలన సమర్థుండును, నిశ్శ్వర్య సమాయుక్తుండును, రథగజతురగ యుతుండునగు సుకేతుండను రాజు గలడు. అతనికి సౌందర్య గాంభీర్య యౌవన సంపన్నురాలగు సువేదియను భార్య గలదు. అట్టి వనితామణితోడం గూడి ధర్మము తప్పక ప్రజాపాలనం బొనర్చుటచే క్షామము, శత్రువుల వలన భయంబును లేకుండెను.
ఇట్లుండ ఆ నరేంద్రునకును, అతని జ్ఞాతులకును విరోధము సంభవించి యుద్ధసన్నద్ధుడై శత్రువులుండు స్థలమునకు పోయి గదాశక్తి భిండివాల తోమర ముసల ముద్గర ప్రాస పట్టిసాద్యాయుధంబులచే కయ్యం బొనర్చె. ఆ ఘోరంబగు సమరమున సుకేతుండు శత్రువులచే గొట్టబడి నిలువజాలక పరుగెత్తి పోవుచుండెను. ఇట్లు పోవుచుండెడి సుకేతుని నతని భార్య గాంచి “ఓహో! మన పురుషుండు సమరమున నిలువనేరక పరుగిడుచుండునపుడు మన మిచట నిలువంద గ” దని ఆ సువేదియు భర్తననుసరించి పోయెను. ఇట్లిరువురు బహుదూరంబు జని ఒక అరణ్య ప్రాంతమును ప్రవేశించి క్షుద్బాధా పీడితులగుచు నివసించియుండ, కొలది రోజులకా రాజశ్రేష్ఠుడు వ్యాధిపీడితుండై నడచుటకు గూడ శక్తిలేక యుండెను. అంతనా రాజపత్ని మిగుల దుఃఖాక్రాంతురాలై భర్తను తన తొడమీద నిడుకొని శోకించుచు నా వనంబున సంచరించుచుండ ఆంగీరస మహర్షి యా వనితామణి చెంతకు వచ్చి యిట్లనియె.
“ఓ నారీతిలకమా! నీకు క్షేమము గలుగును గాక! దంపతులుగా నుండెడు మీరు లెవ్వరు, ఎచ్చట నుండువారు, ఇచ్చటికేల వచ్చితిరి? రాజ్యంబును, బంధుజనంబులను వదలి ఒంటరిగా ఆకలిచే పీడింపబడుచు ఈ వనమునందేల సంచరించుచున్నారు?” అని యడుగ నమ్మగువయు మాటాడుటకు నోరాడక బొటబొట కన్నీరు నించి భోరుమని యెలుగెత్తి వెక్కి వెక్కి యేడ దొడంగె.
అంతనమ్ముని “ఓ వనితారత్నమా! దుఃఖము నొందకుము. లోకంబున మనుజులు దుఃఖము నొందుటచే నే కార్యమును సాధింపబోరు, కావున మీ దుఃఖమున్ పోనడచేద”ను చెప్పుమని దుఃఖోపశమనం బొనర్చి యడుగగా నా సువేదియు నిట్లనియె.
“ముని వర్యా! ఈ నరవరుండు నా పెనిమిటి. ఇతండు రాజ్య పరిపాలనము చేయుచుండ కొద్దిరోజులకు ఇతనికిని, జ్ఞాతులకును విరోధము సంభవించెను. అంత ఇరు తెగలవారును దొడ్డకయ్యం బొనర్చిరి. ఆ కయ్యమున శత్రువులు మిగుల బలపరాక్రమశాలురగుటం జేసి ముసల ముద్గర ప్రాస పట్టిసాద్యాయుధములను మద్భర్తపై ప్రయోగింప, ఇతండు అబ్బాణముల దెబ్బల కోర్వజాలక రాజ్యమునందాసను వదలి యయ్యడవికిం బరుగెత్తి వచ్చుచుండ నేనుం గూడ వచ్చితిని. కావున ఓ మహాత్మా! మరల మాకు రాజ్యమును, పుత్రసంతానంబును కలుగుటకు నుపాయంబును జెప్పుడని యనేక విధంబుల బ్రార్థింప, ఆంగీరస మహర్షి యిట్లనియె.
ఓ పుణ్యవతీ! నా తోడం గూడ రమ్ము. ఇదిగో అతి సమీపమున పంచవటీ తటాకమునందు దుర్గాక్షేత్రంబున్నది. అచ్చట దుర్గాదేవి సన్నిహితురాలైయున్నది. ఆ మహాదేవిని నీవు భక్తియుక్తురాలవై పూజించిన నీకు మరల రాజ్యమును, పుత్రపౌత్రాభిసంపదయును కలుగు” నని చెప్పిన నా సువేది భర్తను మోసికొని ఆంగీరస మహర్షి కడకు గూడివచ్చెను.
ఆ మహర్షియు ఆ సువేదిని భర్తతోడ స్నానము చేయుమనిన నప్పతివ్రతయు స్నానము చేసి వస్త్రములను నెడబెట్టుకొని వచ్చినతోడనే ఆంగీరస మహర్షి సువేదిచే దుర్గా సరస్వతీ దేవతలను షోడశోపచారములతో పూజ చేయించెను.
ఇట్లు సువేది పాడ్యమి మొదలుకొని తొమ్మిది దినములు పూజచేసి, పదియవ దినమున నుదయమునే మేల్కాంచి స్నానము చేసి పాయసాన్నముచే “దుర్గాదేవి” యనెడు మంత్రమున ను చ్చరించుచు హవనం బొనర్చి ఆంగీరస మహర్షికి దంపతీ పూజ చేసి వారి యనుగ్రహము వలన దశదానాది వివిధ దానములం జేసి యథావిధిగ వ్రతమును పరిసమాప్తి బొందించి ఆంగీరస మహర్షితోడ వారి యాశ్రమమునకు నా సువేది భర్తతోడం బోయెను.
అచట కొన్ని దినములు సుఖముగ వాసము చేయుచుండగ దుర్గా సరస్వతీ వ్రతము మొనర్చిన మాహాత్మ్యము వలన నాసువేది గర్భం ధరించి పదియవ మాసమున నొక పుత్రునింగనెను. అంతట ఆంగీరస మహర్షి యబ్బాలునకు జాతకర్మాది సంస్కారము లొనర్చి సూర్యప్రతాపుండను పేరు పెట్టించి ఐదేండ్ల వెళ్లగానే విద్యాభ్యాసము చేయించెను. అంత నా బాలుండు సకల శస్త్రాస్త్ర విద్యల నేర్చుకొని యౌవనంబు వచ్చిన తోడనే మహర్షిచే అనుజ్ఞ దీసికొని శత్రువులపైకి సమరమునకు బోయి, ముసలాది ముద్గరాద్యాయుధములం ప్రయోగించిన శత్రువులు బాలుండగు సూర్యప్రతాపుని తోడం బోరాడనెరక పరుగెత్తిపోయిరి. తోడనే యా బాలుండు తన రాజ్యము బొంది, తలిదండ్రుల దోని సుఖముగ రాజ్యపరిపాలనం బొనర్చి, ప్రతి సంవత్సరమును దుర్గాసరస్వతులను పూజించుచు నిహలమున బహుకాలము సుఖముగ నుండెను. సువేదియు ను ప్రతి సంవత్సరమును దుర్గాసరస్వతులను పూజించుచు సుఖముగ నుండి యనంతరమున కంబున పుత్రపౌత్రాది సంపదల తోడం గూడుకొని సుఖముగ నుండి యనంతరమున స్వర్గమున్ బొందెను.
కావున నీ వ్రతమును బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్రులుం జేయందగు. అట్లొనర్చిన సర్వసౌభాగ్యంబులు కలిగి సుఖంబుగ నుండురు. ఈ కథను వినువారలకును, చదువువారలకును సకల కార్యంబులు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను.
శ్రీ సరస్వతీ వ్రత కథ సమాప్తం
