Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    బాల గణపతి – బాలస్వభావం, జ్ఞానం మరియు శుభప్రదమైన అనుగ్రహాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 11, 2026

    శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)

    September 10, 2026

    వినాయక చవితి వ్రత కథ

    September 9, 2026
    Facebook Instagram YouTube
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026
    • భక్తి

      బాల గణపతి – బాలస్వభావం, జ్ఞానం మరియు శుభప్రదమైన అనుగ్రహాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 11, 2026

      ఖైరతాబాద్ గణేష్

      September 4, 2026

      సూర్యగ్రహణం – బుధవారం, 12 ఆగస్టు 2026

      August 12, 2026

      శ్రావణ మాసం- గురువారం 13 ఆగస్టు , 2026 – శుక్రవారం సెప్టెంబర్ 11, 2026

      August 12, 2026

      గురు పౌర్ణమి / Guru Purnima – జూలై 29, బుధవారం 2026

      July 18, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    పూజ

    శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)

    By JosyulaUpdated:September 10, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    ganesh-chaturthi-puja-pdf download
    Share
    Facebook Twitter LinkedIn Email

    ॥ శ్రీ గణేశాయ నమః ॥

    శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము — 2026

    పసుపు గణపతి పూజా విధానం · షోడశోపచార పూజ · ఏకవింశతి పత్ర పూజ · అష్టోత్తర శతనామావళి · వ్రతకథ

    PDF పూర్తి వ్రతకల్పము PDF డౌన్‌లోడ్ చేసుకోండి ప్రింట్ చేసుకోవడానికి, ఆఫ్‌లైన్‌లో చదువుకోవడానికి అనుకూలం డౌన్‌లోడ్

    మొదటి భాగం — శ్రీ పసుపు గణపతి పూజ

    01ప్రార్థన శ్లోకాలు

    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ । ప్రసన్నవదనం ధ్యాయేత్…

    ఏ శుభకార్యం, వ్రతం లేదా పూజ ప్రారంభించే ముందు చేయవలసిన ప్రాథమిక పూజ.

    శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ । ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
    సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః । లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః । ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః । వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః । షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి, విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా । సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే ॥
    అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యః సురైరపి । సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః ॥
    తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ । విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ॥
    యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా । తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళమ్ ॥
    లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః । యేషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ॥
    ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం । లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ॥
    సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే । శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోఽస్తుతే ॥

    నమస్కారాలు

    • ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ॥
    • ఓం శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః ॥
    • ఓం శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ॥
    • ఓం శ్రీ శచీ పురందరాభ్యాం నమః ॥
    • ఓం శ్రీ అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ॥
    • ఓం శ్రీ సీతారామాభ్యాం నమః ॥
    • ఓం శ్రీ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః ॥

    02దీపారాధన

    భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షి హ్యవిఘ్నకృత్…
    భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షి హ్యవిఘ్నకృత్ । యావత్ పూజాం కరిష్యామి తావత్త్వం సుస్థిరో భవ ॥

    దీపారాధన ముహూర్తః సుముహూర్తోఽస్తు

    03ఆచమనం

    ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా…

    ఓం ఆచమ్య —

    ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ।
    ఉత్తిష్ఠంతు । భూత పిశాచాః । యే తే భూమిభారకాః । యే తేషామవిరోధేన । బ్రహ్మకర్మ సమారభే । ఓం భూర్భువస్సువః । దైవీ గాయత్రీ ఛందః ప్రాణాయామే వినియోగః ॥

    04ప్రాణాయామం

    ఓం భూః । ఓం భువః । ఓమ్ సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః…
    ఓం భూః । ఓం భువః । ఓమ్ సువః । ఓం మహః । ఓం జనః । ఓం తపః । ఓమ్ సత్యమ్ । ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి । ధియో యో నః ప్రచోదయాత్ ॥ ఓమాపో జ్యోతీ రసోఽమృతం బ్రహ్మ భూర్భువస్సువరోమ్ ॥

    05సంకల్పం

    మమ ఉపాత్త దురితక్షయ ద్వారా, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభతిథౌ శోభన ముహూర్తే…
    మమ ఉపాత్త దురితక్షయ ద్వారా, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభతిథౌ శోభన ముహూర్తే ఆద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే స్వ గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరే, దక్షిణాయనే, వర్ష ఋతౌ, భాద్రపద మాసే, శుక్లపక్షే, చతుర్థ్యాం తిథౌ, ఇందు వాసరయుక్తాయాం, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీమాన్ (మీ గోత్రం పేరు) గోత్రః (మీ పేరు) నామధేయః ధర్మ పత్నీ సమేతః అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ అభయ ఆయు రారోగ్య ఐశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం, ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం, సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం, సమస్త దురితోప శాంత్యర్థం, వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరసిద్ధి వినాయక ముద్దిశ్య శ్రీ విఘ్నేశ్వర దేవతా ప్రీత్యర్థం, స్కాంద పురాణ భవిష్యదుత్తర పురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానావాహనాది షోడశోపచార పూజాం కరిష్యే — తదంగత్వేన కలశ పూజాం కరిష్యే ।

    కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య, కలశస్యోపరి హస్తం నిధాయ.

    06కలశారాధన (కలశ పూజ)

    కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః…
    కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః । మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్స్మృతాః ॥ కుక్షౌ తు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా । ఋగ్వేదోఽథ యజుర్వేదో సామవేదో హ్యథర్వణః ॥ అంగైశ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః । ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయ కారకాః ॥
    గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతీ । నర్మదా సింధు కావేరి జలేఽస్మిన్ సన్నిధిం కురు ॥
    అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోఽపి వా । యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ॥

    కొంచెం కలశంలోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ, దేవుడి మీద చల్లి, తమ మీద చల్లుకుని — “పూజా ద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య”.

    07శ్రీ హరిద్రా గణపతి షోడశోపచార పూజ

    ధ్యానం — శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి…

    అథ శ్రీ హరిద్రా గణపతి పూజాం కరిష్యే ।

    • ధ్యానం — శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యాయామి.
    • ఆవాహనం — శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి.
    • ఆసనం — శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి.
    • పాద్యం — శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి.
    • అర్ఘ్యం — శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి.
    • ఆచమనం — శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి.
    • మధుపర్కం — శ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి.
    • పంచామృత స్నానం — శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి.
    • శుద్ధోదక స్నానం — శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి.
    • వస్త్రయుగ్మం — శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
    • ఉపవీతం — శ్రీ మహాగణాధిపతయే నమః ఉపవీతం సమర్పయామి.
    • గంధం — శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి.
    • అక్షతలు — శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి.
    • పుష్ప సమర్పణ — శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాణి సమర్పయామి.

    08శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళి

    1. ఓం సుముఖాయ నమః · 2. ఓం ఏకదంతాయ నమః · 3. ఓం కపిలాయ నమః…
    1. ఓం సుముఖాయ నమః
    2. ఓం ఏకదంతాయ నమః
    3. ఓం కపిలాయ నమః
    4. ఓం గజకర్ణకాయ నమః
    5. ఓం లంబోదరాయ నమః
    6. ఓం వికటాయ నమః
    7. ఓం విఘ్నరాజాయ నమః
    8. ఓం గణాధిపాయ నమః
    9. ఓం ధూమకేతవే నమః
    10. ఓం గణాధ్యక్షాయ నమః
    11. ఓం ఫాలచంద్రాయ నమః
    12. ఓం గజాననాయ నమః
    13. ఓం వక్రతుండాయ నమః
    14. ఓం శూర్పకర్ణాయ నమః
    15. ఓం హేరంబాయ నమః
    16. ఓం స్కందపూర్వజాయ నమః

    నానా విధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి.

    09ధూప, దీప, నైవేద్యం & మంత్రపుష్పం

    ధూపం, దీపం, నైవేద్యం, స్వర్ణపుష్పం, తాంబూలం, నీరాజనం — మహాగణాధిపతికి…
    • ధూపం — శ్రీ మహాగణాధిపతయే నమః ధూప మాఘ్రాపయామి.
    • దీపం — శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
    • నైవేద్యం — శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి.
    • స్వర్ణపుష్పం — శ్రీ మహాగణాధిపతయే నమః స్వర్ణ పుష్పం సమర్పయామి.
    • తాంబూలం — శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి.
    • నీరాజనం — శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి.

    మంత్రపుష్పం

    గణాధిప నమస్తుభ్యం ఉమాపుత్ర గజానన । వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక ॥ ఏకదంతైకవదన తథా మూషిక వాహన । కుమారగురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిమ్ ॥

    మంత్రపుష్పం సమర్పయామి.

    మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సురేశ్వర । యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ॥

    అనయా మయా కృత షోడశోపచార పూజాం శ్రీ మహా గణపతి దేవతార్పణమస్తు.

    సమస్త దురితోప శమనార్థం మహా గణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి — దేవునిపై అక్షతలు తీసుకొని శిరస్సు పై ఉంచాలి.

    10పసుపు వినాయకుని ఉద్వాసన

    ఓం యథాస్థానం ప్రతిష్ఠాపయామి । మహాగణాధిపతయే నమః…
    ఓం యథాస్థానం ప్రతిష్ఠాపయామి । మహాగణాధిపతయే నమః । యథాస్థానం ఉద్వాసయామి । శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ॥

    పసుపు వినాయకుని పీఠమును మూడు మార్లు కదిపి పక్కన ఉంచవలెను.

    రెండవ భాగం — శ్రీ వరసిద్ధి వినాయక షోడశోపచార పూజ

    11ధ్యానం

    భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం, విఘ్నాంధకార భాస్వంతం…

    పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ వరసిద్ధి వినాయక పూజామారంభేత్. అథ షోడశోపచార పూజా.

    భవసంచిత పాపౌఘ విధ్వంసన విచక్షణం, విఘ్నాంధకార భాస్వంతం విఘ్నరాజ మహం భజే ॥ ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం, పాశాంకుశ ధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ॥ ఉత్తమం గణనాథస్య వ్రతం సంపత్కరం శుభం, భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్తం విఘ్ననాయకమ్ ॥ ధ్యాయే గజాననం దేవం తప్తకాంచన సన్నిభం, చతుర్భుజం మహాకాయం సర్వాభరణ భూషితం ॥

    శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః ధ్యాయామి.

    12ఆవాహనం · ఆసనం · అర్ఘ్యం · పాద్యం

    అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర…

    ఆవాహనం

    అత్రాగచ్ఛ జగద్వంద్య సురరాజార్చితేశ్వర । అనాథనాథ సర్వజ్ఞ గౌరీగర్భ సముద్భవ ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆవాహయామి ।

    ఆసనం

    మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితమ్ । రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆసనం సమర్పయామి ।

    అర్ఘ్యం

    గౌరీపుత్ర నమస్తేఽస్తు శంకర ప్రియనందన । గృహాణార్ఘ్యం మయా దత్తం గంధపుష్పాక్షతైర్యుతమ్ ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అర్ఘ్యం సమర్పయామి ।

    పాద్యం

    గజవక్త్ర నమస్తేఽస్తు సర్వాభీష్ట ప్రదాయక । భక్త్యా పాద్యం మయా దత్తం గృహాణ ద్విరదానన ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పాద్యం సమర్పయామి ।

    13ఆచమనీయం · మధుపర్కం · స్నానాలు

    అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత…

    ఆచమనీయం

    అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ వరపూజిత । గృహాణాచమనం దేవ తుభ్యం దత్తం మయా ప్రభో ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆచమనీయం సమర్పయామి ।

    మధుపర్కం

    దధిక్షీర సమాయుక్తం మధ్వాజ్యేన సమన్వితమ్ । మధుపర్కం గృహాణేదం గజవక్త్ర నమోఽస్తు తే ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మధుపర్కం సమర్పయామి ।

    పంచామృత స్నానం

    స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక । అనాథనాథ సర్వజ్ఞ గీర్వాణ గణపూజిత ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పంచామృత స్నానం సమర్పయామి ।

    శుద్ధోదక స్నానం

    గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః । స్నానం కురుష్వ భగవన్నుమాపుత్ర నమోఽస్తు తే ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి ।

    14వస్త్రం · యజ్ఞోపవీతం · గంధం · అక్షతలు · పుష్పాలు

    రక్తవస్త్ర ద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్…

    వస్త్రం

    రక్తవస్త్ర ద్వయం చారు దేవయోగ్యం చ మంగళమ్ । శుభప్రద గృహాణ త్వం లంబోదర హరాత్మజ ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః వస్త్రయుగ్మం సమర్పయామి ।

    యజ్ఞోపవీతం

    రాజితం బ్రహ్మసూత్రం చ కాంచనం చోత్తరీయకమ్ । గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః యజ్ఞోపవీతం సమర్పయామి ।

    గంధం

    చందనాగరు కర్పూర కస్తూరీ కుంకుమాన్వితమ్ । విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతామ్ ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః శ్రీ గంధాన్ ధారయామి ।

    అక్షతలు

    అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాంస్తండులాన్ శుభాన్ । గృహాణ పరమానంద శంభుపుత్ర నమోఽస్తు తే ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి ।

    పుష్పాణి

    సుగంధాని చ పుష్పాణి జాతీ కుంద ముఖాని చ । ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోఽస్తు తే ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః పుష్పైః పూజయామి ।

    15అంగపూజ

    ఓం గణేశాయ నమః — పాదౌ పూజయామి…
    • ఓం గణేశాయ నమః — పాదౌ పూజయామి
    • ఓం ఏకదంతాయ నమః — జానునీ పూజయామి
    • ఓం విఘ్నరాజాయ నమః — జంఘే పూజయామి
    • ఓం ఆఖు వాహనాయ నమః — ఊరూ పూజయామి
    • ఓం హేరంబాయ నమః — కటిం పూజయామి
    • ఓం లంబోదరాయ నమః — ఉదరం పూజయామి
    • ఓం గణాధిపాయ నమః — నాభిం పూజయామి
    • ఓం గణేశాయ నమః — హృదయం పూజయామి
    • ఓం స్థూల కంఠాయ నమః — కంఠం పూజయామి
    • ఓం స్కందాగ్రజాయ నమః — స్కంధౌ పూజయామి
    • ఓం పాశహస్తాయ నమః — హస్తౌ పూజయామి
    • ఓం గజవక్త్రాయ నమః — వక్త్రం పూజయామి
    • ఓం విఘ్నహర్త్రే నమః — నేత్రం పూజయామి
    • ఓం శూర్పకర్ణాయ నమః — కర్ణౌ పూజయామి
    • ఓం ఫాలచంద్రాయ నమః — లలాటం పూజయామి
    • ఓం సర్వేశ్వరాయ నమః — శిరః పూజయామి
    • ఓం శ్రీ విఘ్నరాజాయ నమః — సర్వాణ్యంగాని పూజయామి

    16ఏకవింశతి (21) పత్ర పూజ

    21 రకాల ఆకులతో పూజ — మాచీపత్రం, బృహతీపత్రం, బిల్వపత్రం, దూర్వాయుగ్మం…
    1. ఓం సుముఖాయ నమః — మాచీపత్రం పూజయామి (మాచిపత్రి / దవనం ఆకు)
    2. ఓం గణాధిపాయ నమః — బృహతీపత్రం పూజయామి (ముళ్ల వంకాయ ఆకు / వాకుడు ఆకు)
    3. ఓం ఉమాపుత్రాయ నమః — బిల్వపత్రం పూజయామి (మారేడు ఆకు)
    4. ఓం గజాననాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి (గరిక / గడ్డి)
    5. ఓం హరసూనవే నమః — దత్తూరపత్రం పూజయామి (ఉమ్మెత్త ఆకు)
    6. ఓం లంబోదరాయ నమః — బదరీపత్రం పూజయామి (రేగు ఆకు)
    7. ఓం గుహాగ్రజాయ నమః — అపామార్గపత్రం పూజయామి (ఉత్తరేణి ఆకు)
    8. ఓం గజకర్ణాయ నమః — తులసీపత్రం పూజయామి (తులసి ఆకు)
    9. ఓం ఏకదంతాయ నమః — చూతపత్రం పూజయామి (మామిడి ఆకు)
    10. ఓం వికటాయ నమః — కరవీరపత్రం పూజయామి (గన్నేరు ఆకు)
    11. ఓం భిన్నదంతాయ నమః — విష్ణుక్రాంతపత్రం పూజయామి (విష్ణుక్రాంత ఆకు)
    12. ఓం వటవే నమః — దాడిమీపత్రం పూజయామి (దానిమ్మ ఆకు)
    13. ఓం సర్వేశ్వరాయ నమః — దేవదారుపత్రం పూజయామి (దేవదారు ఆకు)
    14. ఓం ఫాలచంద్రాయ నమః — మరువకపత్రం పూజయామి (మరువం ఆకు)
    15. ఓం హేరంబాయ నమః — సింధువారపత్రం పూజయామి (వావిలి ఆకు)
    16. ఓం శూర్పకర్ణాయ నమః — జాజీపత్రం పూజయామి (జాజి ఆకు)
    17. ఓం సురాగ్రజాయ నమః — గండకీపత్రం పూజయామి (సీతాఫలం ఆకు లేదా దేవగన్నేరు ఆకు)
    18. ఓం ఇభవక్త్రాయ నమః — శమీపత్రం పూజయామి (జమ్మి ఆకు)
    19. ఓం వినాయకాయ నమః — అశ్వత్థపత్రం పూజయామి (రావి ఆకు)
    20. ఓం సుర సేవితాయ నమః — అర్జునపత్రం పూజయామి (మద్ది ఆకు)
    21. ఓం కపిలాయ నమః — అర్కపత్రం పూజయామి (జిల్లేడు ఆకు)

    శ్రీ గణేశ్వరాయ నమః — ఏకవింశతి పత్రాణి పూజయామి.

    17శ్రీ వినాయక అష్టోత్తర శతనామావళి (108)

    1. ఓం గజాననాయ నమః · 2. ఓం గణాధ్యక్షాయ నమః · 3. ఓం విఘ్నరాజాయ నమః…
    1. ఓం గజాననాయ నమః
    2. ఓం గణాధ్యక్షాయ నమః
    3. ఓం విఘ్నరాజాయ నమః
    4. ఓం వినాయకాయ నమః
    5. ఓం ద్వైమాతురాయ నమః
    6. ఓం ద్విముఖాయ నమః
    7. ఓం ప్రముఖాయ నమః
    8. ఓం సుముఖాయ నమః
    9. ఓం కృతినే నమః
    10. ఓం సుప్రదీపాయ నమః
    11. ఓం సుఖ నిధయే నమః
    12. ఓం సురాధ్యక్షాయ నమః
    13. ఓం సురారిఘ్నాయ నమః
    14. ఓం మహాగణపతయే నమః
    15. ఓం మాన్యాయ నమః
    16. ఓం మహా కాలాయ నమః
    17. ఓం మహా బలాయ నమః
    18. ఓం హేరంబాయ నమః
    19. ఓం లంబ జఠరాయ నమః
    20. ఓం హ్రస్వ గ్రీవాయ నమః
    21. ఓం మహోదరాయ నమః
    22. ఓం మదోత్కటాయ నమః
    23. ఓం మహావీరాయ నమః
    24. ఓం మంత్రిణే నమః
    25. ఓం మంగళ స్వరాయ నమః
    26. ఓం ప్రమధాయ నమః
    27. ఓం ప్రథమాయ నమః
    28. ఓం ప్రాజ్ఞాయ నమః
    29. ఓం విఘ్నకర్త్రే నమః
    30. ఓం విఘ్నహంత్రే నమః
    31. ఓం విశ్వ నేత్రే నమః
    32. ఓం విరాట్పతయే నమః
    33. ఓం శ్రీపతయే నమః
    34. ఓం వాక్పతయే నమః
    35. ఓం శృంగారిణే నమః
    36. ఓం ఆశ్రిత వత్సలాయ నమః
    37. ఓం శివప్రియాయ నమః
    38. ఓం శీఘ్రకారిణే నమః
    39. ఓం శాశ్వతాయ నమః
    40. ఓం బలాయ నమః
    41. ఓం బలోత్థితాయ నమః
    42. ఓం భవాత్మజాయ నమః
    43. ఓం పురాణ పురుషాయ నమః
    44. ఓం పూష్ణే నమః
    45. ఓం పుష్కరోక్షిప్త వారిణే నమః
    46. ఓం అగ్రగణ్యాయ నమః
    47. ఓం అగ్రపూజ్యాయ నమః
    48. ఓం అగ్రగామినే నమః
    49. ఓం మంత్రకృతే నమః
    50. ఓం చామీకర ప్రభాయ నమః
    51. ఓం సర్వస్మై నమః
    52. ఓం సర్వోపాస్యాయ నమః
    53. ఓం సర్వ కర్త్రే నమః
    54. ఓం సర్వ నేత్రే నమః
    55. ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః
    56. ఓం సర్వ సిద్ధయే నమః
    57. ఓం పంచహస్తాయ నమః
    58. ఓం పార్వతీనందనాయ నమః
    59. ఓం ప్రభవే నమః
    60. ఓం కుమార గురవే నమః
    61. ఓం అక్షోభ్యాయ నమః
    62. ఓం కుంజరాసుర భంజనాయ నమః
    63. ఓం ప్రమోదోత్తాన నయనాయ నమః
    64. ఓం మోదకప్రియాయ నమః
    65. ఓం కాంతిమతే నమః
    66. ఓం ధృతిమతే నమః
    67. ఓం కామినే నమః
    68. ఓం కపిత్థ పనస ప్రియాయ నమః
    69. ఓం బ్రహ్మచారిణే నమః
    70. ఓం బ్రహ్మరూపిణే నమః
    71. ఓం బ్రహ్మవిద్యాది దానభువే నమః
    72. ఓం జిష్ణవే నమః
    73. ఓం విష్ణుప్రియాయ నమః
    74. ఓం భక్త జీవితాయ నమః
    75. ఓం జిత మన్మథాయ నమః
    76. ఓం ఐశ్వర్య కారణాయ నమః
    77. ఓం జ్యాయసే నమః
    78. ఓం యక్షకిన్నర సేవితాయ నమః
    79. ఓం గంగా సుతాయ నమః
    80. ఓం గణాధీశాయ నమః
    81. ఓం గంభీర నినదాయ నమః
    82. ఓం వటవే నమః
    83. ఓం అభీష్ట వరదాయినే నమః
    84. ఓం జ్యోతిషే నమః
    85. ఓం భక్త నిధయే నమః
    86. ఓం భావ గమ్యాయ నమః
    87. ఓం మంగళ ప్రదాయ నమః
    88. ఓం అవ్యక్తాయ నమః
    89. ఓం అప్రాకృత పరాక్రమాయ నమః
    90. ఓం సత్య ధర్మిణే నమః
    91. ఓం సఖయే నమః
    92. ఓం సరసాంబు నిధయే నమః
    93. ఓం మహేశాయ నమః
    94. ఓం దివ్యాంగాయ నమః
    95. ఓం మణికింకిణీ మేఖలాయ నమః
    96. ఓం సమస్త దేవతా మూర్తయే నమః
    97. ఓం సహిష్ణవే నమః
    98. ఓం సతతోత్థితాయ నమః
    99. ఓం విఘాత కారిణే నమః
    100. ఓం విశ్వగ్దృశే నమః
    101. ఓం విశ్వరక్షాకృతే నమః
    102. ఓం కళ్యాణ గురవే నమః
    103. ఓం ఉన్మత్త వేషాయ నమః
    104. ఓం అపరాజితే నమః
    105. ఓం సమస్త జగదాధారాయ నమః
    106. ఓం సర్వైశ్వర్య ప్రదాయ నమః
    107. ఓం ఆక్రాంత చిదచిత్ప్రభవే నమః
    108. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః

    18ధూపం · దీపం · నైవేద్యం · తాంబూలం · నీరాజనం

    దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్…

    ధూపం

    దశాంగం గుగ్గులోపేతం సుగంధి సుమనోహరమ్ । ఉమాసుత నమస్తుభ్యం గృహాణ వరదో భవ ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ధూపమాఘ్రాపయామి ।

    దీపం

    సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినా ద్యోతితం మయా । గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోఽస్తు తే ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః దీపం దర్శయామి ।

    నైవేద్యం

    సుగంధాన్ సుకృతాంశ్చైవ మోదకాన్ ఘృత పాచితాన్ । నైవేద్యం గృహ్యతాం దేవ చణముద్గైః ప్రకల్పితాన్ ॥ భక్ష్యం భోజ్యం చ లేహ్యం చ చోష్యం పానీయమేవ చ । ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నైవేద్యం సమర్పయామి ।

    తాంబూలం

    పూగీఫల సమాయుక్తం నాగవల్లీ దలైర్యుతమ్ । కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్ ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః తాంబూలం సమర్పయామి ।
    తాంబూల చర్వణానంతరం ఆచమనీయం సమర్పయామి ।

    నీరాజనం

    ఘృతవర్తి సహస్రైశ్చ కర్పూర శకలైస్తథా । నీరాజనం మయా దత్తం గృహాణ వరదో భవ ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః నీరాజనం సమర్పయామి ।
    నీరాజనానంతరం ఆచమనీయం సమర్పయామి ।

    19దూర్వాయుగ్మ (గరిక) పూజ

    ఓం గణాధిపాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి…
    • ఓం గణాధిపాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి
    • ఓం ఉమాపుత్రాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి
    • ఓం ఆఖు వాహనాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి
    • ఓం వినాయకాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి
    • ఓం ఈశపుత్రాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి
    • ఓం వరసిద్ధి ప్రదాయకాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి
    • ఓం ఏకదంతాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి
    • ఓం ఇభవక్త్రాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి
    • ఓం మూషిక వాహనాయ నమః — దూర్వాయుగ్మం పూజయామి
    • ఓం కుమారగురవే నమః — దూర్వాయుగ్మం పూజయామి

    20మంత్రపుష్పం & ప్రదక్షిణం

    గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్ర గజానన…

    మంత్రపుష్పం

    గణాధిప నమస్తేఽస్తు ఉమాపుత్ర గజానన । వినాయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక ॥ ఏకదంతైకవదన తథా మూషక వాహన । కుమారగురవే తుభ్యమర్పయామి సుమాంజలిమ్ ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః మంత్రపుష్పం సమర్పయామి ।

    ప్రదక్షిణం

    ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదకప్రియ । నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన ॥ ప్రమథగణ దేవేశ ప్రసిద్ధే గణనాయక, ప్రదక్షిణం కరోమి త్వా మీశపుత్ర నమోఽస్తుతే ॥ యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ । తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ఆత్మప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి ।

    21సాష్టాంగ నమస్కారం & ప్రార్థన

    ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా…

    సాష్టాంగ నమస్కారం

    ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోఽష్టాంగ ముచ్యతే ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః సాష్టాంగ నమస్కారం సమర్పయామి ।

    ప్రార్థన

    ప్రసీద దేవదేవేశ ప్రసీద గణనాయక । ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాంగతిమ్ ॥ వినాయక నమస్తుభ్యం సతతం మోదకప్రియ । నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా ॥

    ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామినే నమః ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి ।

    22వాయనదానము & ప్రతిమా మంత్రం

    గణేశ ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ…

    వాయనదానము

    గణేశ ప్రతిగృహ్ణాతు గణేశో వై దదాతి చ, గణేశ స్తారకోభాభ్యాం గణేశాయ నమో నమః ॥

    ప్రతిమా మంత్రం

    ఓం వినాయకస్య ప్రతిమాం వస్త్రయుగ్మ సమన్వితాం, తుభ్యం దాస్యామి విప్రేంద్ర యథోక్త ఫలో భవ ॥

    ప్రతిమాదానం కరిష్యామి.

    ఛత్రమాచ్ఛాదయామి । చామరైర్వీజయామి । నృత్యం దర్శయామి । గీతం శ్రావయామి । వాద్యం ఘోషయామి । ఆందోలికామారోహయామి । అశ్వానారోహయామి । గజానారోహయామి ॥

    సమస్త రాజోపచార దేవోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజాం సమర్పయామి ॥

    23క్షమాపణ

    యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు…
    యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు । న్యూనం సంపూర్ణతాం యాతి సద్యో వందే గజాననమ్ ॥
    మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వినాయక । యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు తే ॥

    అనయా ధ్యానావాహనాది షోడశోపచార పూజయా భగవాన్ సర్వాత్మకః శ్రీ వరసిద్ధి వినాయకః స్వామి సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు ।

    మూడవ భాగం — వినాయక వ్రతకథ

    24వ్రతకథా ప్రారంభము — నైమిశారణ్యం

    శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండగు భగవంతుని సృష్టిని శ్రేష్ఠమగు ఈ భరతఖండమున…

    శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండగు భగవంతుని సృష్టిని శ్రేష్ఠమగు ఈ భరతఖండమున ఉత్తరభాగమునందు ఆర్యావర్తమను పుణ్యభూమి యొప్పుచుండె. అందు కల్హార కేదార కరవీర జాజి విరజాజి జపాపాటలీ కేతకీ నాగ పున్నాగ మల్లికా మతల్లికా కుంద కురవక మందార చంపక చాంపేయాది అనేక పుష్పరాజి విరాజితమును, సాల రసాల తాల హింతాల తమాల తక్కోల చూత పూగ వకుళ అశోక కపిత్థ అశ్వత్థ ప్లక్షకాది అనేక వృక్ష శోభితంబును, హంస కారండవ చక్రవాక జలకుక్కుట కోకిలాద్యనేక పక్షి కృత కోలాహల నివహంబును, నిర్మల ప్రవాహ రమణీయ సరోవర యుక్తంబును, ప్రాణాయామ ప్రత్యాహార ధ్యానధారణ సమాధ్యష్టాంగ యోగ నిష్ఠాగరిష్ఠ హరిహర పూజా మకరంద పానానంద తుందిల హృదయారవింద మునివర్య దివ్యాశ్రమ విలసితంబునగు నైమిశారణ్యంబు వెలయుచుండె.

    అందనేక ధర్మశాస్త్ర పురాణేతిహాసంబుల జెప్పు పౌరాణికుండగు సూతుండు శౌనకాది మునులకనేక శాస్త్రములు బోధించుచుండెను. ఇట్లుండిన చంద్రవంశంబునందు బుట్టిన ధర్మరాజు దైవయోగము వలన జ్ఞాతులచే రాజ్యమును పోగొట్టుకొని అనేక వృక్ష పక్షి మృగంబులుగల యడవి ప్రవేశించి, అందువారు వాయుభక్షకులుగను, పర్ణభక్షకులుగను తపంబు చేయుచుండెడి మహాత్ములకు ఋషులన్ జూచుచు సూతునియెడకు పోయి భార్యానుజుల తోడ నమస్కరించి యిట్లనియె — “ఓ మహాత్మా! మేము జ్ఞాతులచే రాజ్యమును, సంపత్తును గోలుపోయి వచ్చినారము. మీ దర్శన మాత్రంబున సకల పాపంబులు నశించి, మాయందు కృప గలిగి మరల రాజ్యాదులు గలుగునట్టి యొక వ్రతంబానతీయవలయునని” వేడగా —

    25శివుడు కుమారస్వామికి తెలిపిన వ్రత విధానం

    సూతుండు ఇట్లనియె, “ధర్మరాజా! సమస్త పాపంబులం పోగొట్టి పుత్రపౌత్రాది వృద్ధింజేయు రహస్యమైన యొక వ్రతము గలదు…”

    సూతుండు ఇట్లనియె — “ధర్మరాజా! సమస్త పాపంబులం పోగొట్టి పుత్రపౌత్రాది వృద్ధింజేయు రహస్యమైన యొక వ్రతము గలదు. దానిని తొల్లి సాంబశివుండు కుమారస్వామి కుపదేశించె. అదెట్లనిన — ప్రమథగణాధిప సేవితంబును, నానారత్న విభూషితంబునగు కైలాస పర్వతంబు నందలి మందారవృక్ష సమీపంబున స్వర్ణ సింహాసనమందు పరమశివుండు కూర్చుండియుండిన, షణ్ముఖుడు ఏతెంచి ఇట్లనె — ‘ఓ నీలకంఠా! లోకంబున నుండు మనుజులే వ్రతంబు చేసినట్లైన పుత్రపౌత్రాదుల జెంది సుఖంబుగా నుందురో అట్టి వ్రతంబును జెప్పు’ మనిన శివుండు —

    ‘ఓ కుమారస్వామీ! ఆయువును సర్వసంపత్తును వృద్ధిజేసెడి వినాయక వ్రతం ఒకటి కలదు. ఆ వ్రతంబును భాద్రపద మాస శుక్ల పక్ష చవితినాడు చేయవలెను. నాడు ప్రాతఃకాలమున స్నానము చేసి శుచిర్భూతుడై నిత్యకర్మల నెరవేర్చుకొని తన శక్తికొలది బంగారుతో నైనను, వెండితోనైనను, లేక మట్టితోనైనను విఘ్నేశ్వర ప్రతిమను చేసి గృహోత్తర ప్రదేశమున మండపం బేర్పరచి యందు పండ్లు గాని, బియ్యముగాని పోసి అష్టదళపద్మం బేర్పరచి గణేశ ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతగంధాక్షత పుష్పములతో పూజించి ధూపదీపములు సమర్పించి కుడుములు మొదలైన పిండివంటలు, టెంకాయలు, అరటిపండ్లు, నేరేడు పండ్లు, చెరుకు మొదలైన ఫలములను ప్రత్యక్షముగా దినుసున ఇరువది ఒక్కటి ప్రకారము నైవేద్యము చేసి, నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో గణపతిపూజ సమాప్తమొందించి, యథాశక్తిగా వేద విధులైన బ్రాహ్మణులకు తాంబూల దక్షిణలిచ్చి బంధువులతోడ ఘృతపక్వములైన భక్ష్యభోజ్యాదులచే భుజింపవలెను. ఈ ప్రకారం బెవ్వరు గణపతికి సేవ చేయుచున్నారో వారికి గణపతి వరప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఇందుకు సంశయము లేదు.

    మరునాడుదయముననే నిద్ర లేచి స్నానాదులం గావించి పునః పూజ యొనర్చి వారివారి ఇష్టానుసారము గణనాధునికి మౌంజీ కృష్ణాజిన దండ యజ్ఞోపవీత కమండలు వస్త్రములను సమర్పించి, పురోహితులకు వస్త్రముల దక్షిణ తాంబూలములనిచ్చి, ఇతర విప్రులను దక్షిణ తాంబూల భోజనాదులచే తృప్తులం చేయవలయును. కుమార స్వామీ! వ్రతములలో నుత్తమంబైన యీ వ్రతరాజము మూడు లోకములయందును ప్రసిద్ధిజెంది గరుడ, గంధర్వ, కిన్నర కింపురుషాదులచే సదా యాచరింపబడిన’ దని స్కందునకు పరమశివుండు ఉపదేశించెను.

    కావున ఓ ధర్మరాజా! నీవును ఈ వ్రతమును చేసితివేని శత్రువులను జయించి సుఖముగ నుందువు.”

    26శమంతకమణి కథ

    తొల్లి ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడెను. శ్రీకృష్ణుడు ఆచరించి…

    మరియూ, తొల్లి ఈ వ్రతమును దమయంతి ఆచరించి నలమహారాజును పెండ్లాడెను. శ్రీకృష్ణుడు ఆచరించి శమంతకమణి తోడం జాంబవతిని బొందెను.

    అదెట్లనిన — సత్రాజిత్తను నరేంద్రుండు సూర్యుని వరముచే శమంతకమణిని బొంది శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకకుం బోవ, రెండవ సూర్యునివలె ప్రకాశించుచున్న శమంతక మణిని శ్రీకృష్ణుడు అడుగగా, దానిని సత్రాజిత్తు ఇవ్వక తన యూరికిం బోయె. పిదప సత్రాజిత్తు తమ్ముడా మణిని ధరించుకొని వేటకు బోవగా అచటనొక సింహము వానిని వధించి ఆ మణి ఎత్తుకుపోవుచుండగా, జాంబవంతుండు దానిని హతంబొనర్చి, ఆ మణిని తన గుహకుం దీసికొనిపోయె.

    ఈ సంగతి లోకులకు తెలియమింజేసి శ్రీకృష్ణుడు సత్రాజిత్తుని తమ్మునిన్ దునిమి ఆ శమంతక మణిని అపహరించెనని చెప్పుకొనుచుండ, శ్రీకృష్ణుడు తాను వినాయకునిచే శపించబడిన చవితిచంద్రుని క్షీరఘటమందు చూచుటచేతనే తనకట్టి యపవాదము సంభవించెనని బలభద్రునితో జెప్పె.

    27చవితి చంద్రునికి వినాయకుని శాపము

    కైలాసమున ఒకనాడు వినాయకుండు కుబ్జరూప ధరుండై ప్రకాశించుచుండ నతనిని చూచి చంద్రుండు నవ్వె…

    అతండు చవితి చంద్రునకు వినాయకుండు ఎట్లు శాపంబిడెనని యడుగగా, కృష్ణమూర్తి యిట్టులనియె — “అన్నా! కైలాసమున ఒకనాడు వినాయకుండు కుబ్జరూప ధరుండై ప్రకాశించుచుండ నతనిని చూచి చంద్రుండు నవ్వె. అంత వినాయకుండు చంద్రుని జూచి ‘ఓరీ! నిన్ను ఈ చవితిదినమున నెవ్వరైన జూచిరేని వారి కపవాదము సిద్ధించును’ అని శపించె.

    చంద్రుండు అతి దీనుండై ప్రార్థింప, వినాయకుండు — ‘స్కందునకు సాంబశివుండానతిచ్చిన ప్రకారము భాద్రపద శుద్ధ చవితి దినమందు నన్ను యథావిధిగా అర్చించి వ్రతము సలిపిరేని అట్టివారికి సంభవించిన యపవాదము తొలగి, శత్రుజయమును, మోక్ష సామ్రాజ్య సిద్ధియూ, పుత్రపౌత్ర గోమహిషాద్యభివృద్ధి గలుగు’ నని చంద్రునకుం జెప్పె. అంత చంద్రుండు మొదలగు వారీ వ్రతమును చేసి” రని కృష్ణుడు బలభద్రునితో జెప్పె.

    బలభద్రుండు తన పురమునందెల్ల వారును ఈ వ్రతమును సల్పునటుల జేసి, తానును, కృష్ణమూర్తియూ యథావిధి వ్రతంబొనర్చి వినాయకుని ప్రసాదముచే జాంబవంతుని చెంతకుం బోవ నతడు జాంబవతియను తన కూతురును కృష్ణమూర్తికి ఇచ్చి వివాహము చేసి, శమంతకమణిని గూడ నొసంగిన, నా రత్నమును వాసుదేవుండు సత్రాజిత్తుని కిచ్చిన, నతండు సత్యభామ యను కూతురు నివ్వగా, దానిని వివాహమాడి కృష్ణుడు సుఖముగా నుండె.

    28ఫలశ్రుతి — వ్రతకథ సమాప్తము

    మనసున తలచిన కార్యములన్నియు వినాయక వ్రతము సలుపుట వలన సిద్ధియించుటచే…

    మరియు వృత్రాసురుని హతం బొనర్చునపుడు ఇంద్రుండును, సీతాదేవిని వెదకునప్పుడు శ్రీరాముండును, గంగను భూమికి తెచ్చునప్పుడు భగీరథుండును, అమృతోత్పాదనము సేయునప్పుడు దేవాసురులును, కుష్ఠు వ్యాధి నివృత్తికొరకు సాంబుండును వినాయక వ్రతమును జేసిరి — అని నుడివిన, ధర్మరాజును నీ వ్రతమును సలిపి శత్రువుల జయించి రాజ్యములను పొంది సుఖముగ నుండె.

    కావున, మనసున తలచిన కార్యములన్నియు వినాయక వ్రతము సలుపుట వలన సిద్ధియించుటచే గణపతి సిద్ధివినాయకుం డని ప్రసిద్ధి జెందె.

    విద్యారంభ కాలమున పూజించిన విద్యాలాభంబు గలుగును. పుత్రార్థ కాముకులు పుత్రార్థములను బడయుదురు. కన్య పూజించినచే చక్కని భర్తను, ముత్తయిదువ పూజించినచే నిత్య సౌభాగ్యమును పొందుదురు. విధవ పూజించినచే మరి ఏ జన్మమందును వైధవ్యమును పొందదు. కావున బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు యథావిధిగా నీ వ్రతం బాచరించిన శ్రీ గణపతి యనుగ్రహమున సకలైశ్వర్యములం బొంది సుఖముగ నుందురుగాక.

    ॥ వినాయక వ్రతకథ సమాప్తము ॥

    ॥ శ్రీ వరసిద్ధి వినాయక ప్రసాదం సిద్ధిరస్తు ॥

    www.vishnumukham.com

    Featured
    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    వినాయక చవితి వ్రత కథ

    September 9, 2026

    వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

    September 9, 2026

    శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

    August 30, 2026
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (105)
    • అష్టోత్తరం (44)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (9)
    • దేవి మహాత్మ్యం (18)
    • పూజ (15)
    • భక్తి (170)
    • భగవత్ గీత (19)
    • మన పండుగలు (37)
    • ముఖ్యం (4)
    • విజ్ఞానం (23)
    • స్తోత్రాలు (63)
    Don't Miss

    బాల గణపతి – బాలస్వభావం, జ్ఞానం మరియు శుభప్రదమైన అనుగ్రహాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

    JosyulaSeptember 11, 2026

    బాల గణపతి ఎవరు? బాల గణపతి శ్రీ మహాగణపతి యొక్క 32 దివ్య రూపాలలో ఒక అందమైన, మంగళకరమైన స్వరూపం.…

    శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)

    September 10, 2026

    వినాయక చవితి వ్రత కథ

    September 9, 2026

    వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

    September 9, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.