శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం
(ఏ శుభకార్యం, వ్రతం లేదా పూజ ప్రారంభించే ముందు చేయవలసిన ప్రాథమిక పూజ)
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ।
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ।
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి,
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ॥
అభిప్సితార్థ సిద్ధ్యర్ధం పూజతో యః సురైరపి |
సర్వవిఘ్నచ్చిదే తస్మై గణాధిపతయే నమః ||
దీపారాధన
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షిహ్యవిఘ్నకృత్
యావత్ పూజాం కరిష్యామి తావత్వంసుస్థిరో భవ
ఆచమనం
ఓం ఆచమ్య – ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ।
ఉత్తిష్ఠంతు | భూత పిశాచా | యే తే భూమిభారకాః | యే తేషా మవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
సంకల్పం
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభతిథౌ శోభన ముహూర్తే ఆధ్యబ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే స్వ గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరే దక్షిణాయనే, వర్షా ఋతౌ, శ్రావణ మాసే, శుక్లపక్షే, (21 ఆగష్టు 2026 న అయితే : ) నవమి తిధౌ లేదా (28 ఆగష్టు 2026 న అయితే : ) పౌర్ణమి తిధౌ శుక్ర వాసరయుక్తాయాం, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయా మస్యాం శుభతిధౌ శ్రీమాన్ (మీ గోత్రం పేరు) గోత్రహ (మీ పేరు) నామ దేయహ ధర్మ పత్ని సమేతహ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాయు రారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ ముద్దిశ్య వరలక్ష్మీ దేవతా ప్రీత్యర్థం భవిష్యదుత్తరపురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే – తదంగత్వేన కలశపూజాం కరిష్యే-కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్యోపరిహస్తంనిధాయ.
కలశారాధన (కలశ పూజ)
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః
అంగై శ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయ కారకాః
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
(కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ , దేవుడి మీద చల్లి, తమ మీద చల్లుకుని)
పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య
అధ శ్రీ హరిద్రా గణపతి పూజాం కరిష్యే
ధ్యానం : శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానం – ధ్యానం సమర్పయామి.
ఆవాహనం : శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి.
ఆసనం : శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి.
పాద్యం : శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం : శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనం : శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి.
మధుపర్కం : శ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి.
పంచామృత స్నానం : శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి.
శుద్ధోదక స్నానం : శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం : శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
ఉపవీతం : శ్రీ మహాగణాధిపతయే నమః ఉద్వర్తనం సమర్పయామి.
గంధం : శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి.
అక్షతలు : శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి.
పుష్ప సమర్పణ : శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాణి సమర్పయామి.
శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః
ఓం సుముఖాయ నమః
ఓం ఏకదంతాయ నమః
ఓం కపిలాయ నమః
ఓం గజకర్ణకాయ నమః
ఓం లంబోదరాయ నమః
ఓం వికటాయ నమః
ఓం విఘ్నరాజాయ నమః
ఓం గణాధిపాయ నమః
ఓం ధూమకేతవే నమః
ఓం గణాధ్యక్షాయ నమః
ఓం ఫాలచంద్రాయ నమః
ఓం గజాననాయ నమః
ఓం వక్రతుండాయ నమః
ఓం శూర్పకర్ణాయ నమః
ఓం హేరంబాయ నమః
ఓం స్కందపూర్వజాయ నమః
నానా విధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి

ధూపం : ధూప మాఘ్రాపయామి.
దీపం : దీపం దర్శయామి.
నైవేద్యం : నైవేద్యం సమర్పయామి.
స్వర్ణపుష్పం : స్వర్ణ పుష్పం సమర్పయామి
తాంబూలం : తాంబూలం సమర్పయామి.
నీరాజనం : నీరాజనం సమర్పయామి.
మంత్రపుష్పం
గణాధిప నమస్తుభ్యం ఉమాపుత్ర గజానన,
వినయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక ।
ఏకదంతం తైకవాదన తథా మూషిక వాహన
కుమారగురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం ॥
మంత్రపుష్పం సమర్పయామి.
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర |
యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||
అనయా మయా కృత షోడశోపచార పూజాం శ్రీ మహా గణపతి దేవతార్పణమస్తు
సమస్త దురితోప శమనార్థం శ్రీ మహా గణపతి ప్రసాదం శిరసా గృహ్నామి
(దేవునిపై అక్షతలు తీసుకొని శిరస్సుపై ఉంచాలి)
పసుపు వినాయకుని యథాస్థానం ఉద్వాసయామి
ఓం యథాస్థానం ప్రతిష్ఠాపయామి ।
శ్రీ మహాగణాధిపతయే నమః ।
యథాస్థానం ఉద్వాసయామి ।
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ॥
(పసుపు వినాయకుని పీఠమును మూడు మార్లు కదిపి పక్కన ఉంచవలెను)
శ్రీ వరలక్ష్మీవ్రతం
పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ వరలక్ష్మీ పూజామారంభేత్.
షోడశోపచారపూజా ప్రారంభః
ప్రార్ధనం
ॐ పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే|
నారాయణ ప్రియే దేవీ సుప్రీతా భవసర్వదా ॥
ధ్యానం:
క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే|
సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే ||
శ్రీ వరలక్ష్మీ దేవతాం ధ్యాయామి।
ఆవాహనం:
సర్వమంగళమాంగల్యే విష్ణువక్షస్థలాలయే,
ఆవాహయామి దేవి త్వం సుప్రీతా భవ సర్వదా।
శ్రీ వరలక్ష్మీ దేవతాం ఆవాహయామి।
ఆసనం:
సూర్యాయుతనిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే,
సింహాసనమిదం దేవి స్వీయతాం సురపూజితే,
రత్నసింహాసనం సమర్పయామి।
పాద్యం:
సువాసితజలం రమ్య సర్వతీర్థసముద్భవం,
పాద్యం గృహాణ దేవి త్వం సర్వదేవనమస్కృతే।
పాద్యం సమర్పయామి।
అర్ఘ్యం:
శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాది మిశ్రితం,
అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే।
అర్ఘ్యం సమర్పయామి।
ఆచమనీయం:
సువర్ణకలశానీతం చందనాగురుసంయుతం,
గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే।
ఆచమనీయం సమర్పయామి।
పంచామృతస్నానం:
పయోదధిఘృతోపేతం శర్కరామధుసంయుతం,
పంచామృతస్నానమిదం గృహాణ కమలాలయే,
పంచామృతస్నానం సమర్పయామి।
శుద్ధోదక స్నానం:
గంగాజలం మయానీతం మహాదేవ శిరస్థితం,
శుద్ధోదకమిదం స్నానం గృహాణ విధుసోదరి।
శుద్ధోదక స్నానం సమర్పయామి।
వస్త్రయుగ్మం:
సురార్చితాంఘ్రియుగళే దుకూలవసనప్రియే,
వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే,
వస్త్రయుగ్మం సమర్పయామి.
ఆభరణం:
కేయూరకంకణై ర్దివ్య హారనూపురమేఖలా,
విభూషణాన్యమూల్యాని గృహాణ భువనేశ్వరి।
ఆభరణాని సమర్పయామి।
ఉపవీతం:
తప్త హేమకృతం సూత్రం ముక్తాదామ విభూషితం,
ఉపవీతమిదం దేవి గృహాణ త్వం శుభప్రదే।
ఉపవీతం సమర్పయామి।
గంధం:
కర్పూరాగరుకస్తూరి రోచనాదిభిరన్వితం,
గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం।
గంధం సమర్పయామి।
అక్షతాన్:
అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలీయాన్ తండులాన్ శుభాన్,
హరిద్రా కుంకుమోపేతాన్ గృహ్యతా మబ్దిపుత్రికే ।
అక్షతాన్ సమర్పయామి।
పుష్పపూజ:
మల్లికాజాజికుసుమై శ్ఛంపకై ర్వకుళై స్తథా,
నీలొత్పలైశ్చకల్హారైః పూజయామి హరిహ్రియే।
పుష్పైః పూజయామి।
అధాంగపూజ
ఓం చంచలాయై నమః — పాదౌ పూజయామి
ఓం చపలాయై నమః — జానునీ పూజయామి
ఓం పీతాంబరధరాయై నమః — ఊరూం పూజయామి
ఓం కమలవాసిన్యై నమః — కటిం పూజయామి
ఓం పద్మాలయాయై నమః — నాభిం పూజయామి
ఓం మదనమాత్రే నమః — స్తనౌ పూజయామి
ఓం లలితాయై నమః — భుజద్వయం పూజయామి
ఓం కంబుకంఠ్యై నమః — కంఠం పూజయామి
ఓం సుముఖాయై నమః — ముఖం పూజయామి
ఓం శ్రియై నమః — ఓష్టౌ పూజయామి
ఓం సునాసికాయై నమః — నాసికాం పూజయామి
ఓం సునేత్రై నమః — నేత్రం పూజయామి
ఓం రమాయై నమః — కర్ణౌ పూజయామి
ఓం కమలాయై నమః — శిరః పూజయామి
ఓం వరలక్ష్మ్యై నమః — సర్వాణ్యంగాని పూజయామి
శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి
- ఓం ప్రకృత్యై నమః
- ఓం వికృత్యై నమః
- ఓం విద్యాయై నమః
- ఓం సర్వభూతహితప్రదాయై నమః
- ఓం శ్రద్ధాయై నమః
- ఓం విభూత్యై నమః
- ఓం సురభ్యై నమః
- ఓం పరమాత్మికాయై నమః
- ఓం వాచ్యై నమః
- ఓం పద్మాలయాయై నమః
- ఓం పద్మాయై నమః
- ఓం శుచయే నమః
- ఓం స్వాహాయై నమః
- ఓం స్వధాయై నమః
- ఓం సుధాయై నమః
- ఓం ధన్యాయై నమః
- ఓం హిరణ్మయ్యై నమః
- ఓం లక్ష్మ్యై నమః
- ఓం నిత్యపుష్టాయై నమః
- ఓం విభావర్యై నమః
- ఓం అదిత్యై నమః
- ఓం దిత్యై నమః
- ఓం దీప్తాయై నమః
- ఓం వసుధాయై నమః
- ఓం వసుధారిణ్యై నమః
- ఓం కమలాయై నమః
- ఓం కాంతాయై నమః
- ఓం కామాక్ష్యై నమః
- ఓం క్రోధసంభవాయై నమః
- ఓం అనుగ్రహప్రదాయై నమః
31. ఓం బుద్ధయే నమః
32. ఓం అనఘాయై నమః
33. ఓం హరివల్లభాయై నమః
34. ఓం అశోకాయై నమః
35. ఓం అమృతాయై నమః
36. ఓం దీప్తాయై నమః
37. ఓం లోకశోకవినాశిన్యై నమః
38. ఓం ధర్మనిలయాయై నమః
39. ఓం కరుణాయై నమః
40. ఓం లోకమాత్రే నమః
41. ఓం పద్మప్రియాయై నమః
42.ఓం పద్మహస్తాయై నమః
43.ఓం పద్మాక్ష్యై నమః
44.ఓం పద్మసుందర్యై నమః
45.ఓం పద్మోద్భవాయై నమః
46.ఓం పద్మముఖ్యై నమః
47.ఓం పద్మనాభప్రియాయై నమః
48.ఓం రమాయై నమః
49.ఓం పద్మమాలాధరాయై నమః
50.ఓం దేవ్యై నమః
51.ఓం పద్మిన్యై నమః
52.ఓం పుణ్యగంధాయై నమః
53.ఓం సుప్రసన్నాయై నమః
54.ఓం ప్రసాదాభిముఖ్యై నమః
55.ఓం ప్రభాయై నమః
56.ఓం చంద్రవదనాయై నమః
57.ఓం చంద్రాయై నమః
58.ఓం చంద్రసహోదర్యై నమః
59.ఓం చతుర్భుజాయై నమః
60.ఓం చంద్రరూపాయై నమః
61.ఓం ఇందిరాయై నమః
62.ఓం ఇందుశీతలాయై నమః
63.ఓం ఆహ్లాదజనన్యై నమః
64.ఓం పుష్ట్యై నమః
65.ఓం శివాయై నమః
66.ఓం శివకర్యై నమః
67.ఓం సత్యై నమః
68.ఓం విమలాయై నమః
69.ఓం విశ్వజనన్యై నమః
70.ఓం పుష్టయే నమః
71.ఓం దారిద్ర్యనాశిన్యై నమః
72.ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః
73.ఓం శాంతాయై నమః
74.ఓం శుక్లమాల్యాంబరాయై నమః
75.ఓం శ్రియై నమః
76.ఓం భాస్కర్యై నమః
77.ఓం బిల్వనిలయాయై నమః
78.ఓం వరారోహాయై నమః
79.ఓం యశస్విన్యై నమః
80.ఓం వసుంధరాయై నమః
81.ఓం ఉదారాంగాయై నమః
82.ఓం హరిణ్యై నమః
83.ఓం హేమమాలిన్యై నమః
84.ఓం ధనధాన్యకర్యై నమః
85.ఓం సిద్ధయే నమః
86.ఓం స్త్రైణసౌమ్యాయై నమః
87.ఓం శుభప్రదాయై నమః
88.ఓం నృపవేశ్మగతానందాయై నమః
89.ఓం వరలక్ష్మ్యై నమః
90.ఓం వసుప్రదాయై నమః
91. ఓం శుభాయై నమః
92.ఓం హిరణ్యప్రాకారాయై నమః
93.ఓం సముద్రతనయాయై నమః
94.ఓం జయాయై నమః
95.ఓం మంగళాదేవ్యై నమః
96.ఓం విష్ణువక్షఃస్థలస్థితాయై నమః
97.ఓం విష్ణుపత్న్యై నమః
98.ఓం ప్రసన్నాక్ష్యై నమః
99.ఓం నారాయణసమాశ్రితాయై నమః
100.ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః
101.ఓం దేవ్యై నమః
102.ఓం సర్వోపద్రవవారిణ్యై నమః
103.ఓం నవదుర్గాయై నమః
104.ఓం మహాకాళ్యై నమః
105.ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః
106.ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః
108.ఓం భువనేశ్వర్యై నమః
అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి
ధూపం:
దశాంగం గుగ్గులోపేతం సుగంధం మనోహరం
ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మీ గృహాణ తం
ధూపం సమర్పయామి।
దీపం:
ఘృతాక్తవర్తి సంయుక్త మంధకార వినాశకం
దీపం దాస్యామి తే దేవి గృహాణ ముదితా భవ।
దీపం సమర్పయామి।
నైవేద్యం:
నైవేద్యం షడ్రసోపేతం దధిమధ్వాజ్య సంయుతం
నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే।
నైవేద్యం సమర్పయామి।
పానీయం:
ఘనసారసుగంధేన మిశ్రితం పుష్పవాసితం
పానీయం గృహ్యతాం దేవి శీతలం సుమనోహరం।
పానీయం సమర్పయామి।
తాంబూలం:
పూగీఫలసమాయుక్తం నాగవల్లి దళైర్యుతం
కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం।
తాంబూలం సమర్పయామి।
నీరాజనం:
నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం
తుభ్యం దాస్యా మ్యహం దేవి గృహ్యతాం విష్ణు వల్లభే ।
నీరాజనం సమర్పయామి।
మంత్రపుష్పం:
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా।
మంత్రపుష్పం సమర్పయామి।
ప్రదక్షిణ:
యానికానిచ పాపాని జన్మాంతరకృతానిచ
తానితాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే।
ప్రదక్షిణం సమర్పయామి।
నమస్కారం:
నమస్త్రైలోక్య జనని నమస్తే విష్ణువల్లభే
పాహిమాం భక్తవరదే వరలక్ష్మీ నమో నమః।
శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః నమస్కారాన్ సమర్పయామి।
అధ తోరబంధ పూజా
ఓం కమలాయై నమః — ప్రధమగ్రంధిం పూజయామి
ఓం రమాయై నమః — ద్వితీయగ్రంధిం పూజయామి
ఓం లోకమాత్రే నమః — తృతీయగ్రంధిం పూజయామి
ఓం విశ్వజనన్యై నమః — చతుర్థగ్రంధిం పూజయామి
ఓం మహాలక్ష్మ్యై నమః — పంచమగ్రంధిం పూజయామి
ఓం క్షీరాబ్ధితనయాయై నమః — షష్ఠమగ్రంధిం పూజయామి
ఓం విష్ణుపత్న్యై నమః — సప్తమగ్రంధిం పూజయామి
ఓం చంద్ర సోదర్యై నమః — అష్టమగ్రంధిం పూజయామి
ఓం హరివల్లభాయై నమః — నవమగ్రంధిం పూజయామి
తోరబంధన మంత్రం
బద్ధ్నా మిదక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం,
పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే రమే।
(ఈ మంత్రం చదివి తోరము కట్టుకోవలెను)
వాయనవిధిః
ఏవం సంపూజ్య కల్యాణీం వరలక్ష్మీం స్వశక్తితః,
దాతవ్యం ద్వాదశపూపం వాయనం హి ద్విజాతయే।
వాయనదాన మంత్రం
ఇందిరాప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ,
ఇందిరా తారకోభాభ్యాం ఇందిరాయై నమో నమః।
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం జనార్దన |
యత్కృతం తు మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||
అనయా మయా కృత షోడశోపచార పూజాం శ్రీ వరలక్ష్మి దేవతార్పణమస్తు
సర్వ సౌభాగ్య సిద్ధ్యర్ధం శ్రీ వరలక్ష్మి దేవత ప్రసాదం శిరసా గృహ్ణామి
(దేవునిపై పుష్పాక్షతలు తీసుకొని శిరస్సుపై ఉంచాలి)
ఇతి పూజావిధానం సంపూర్ణమ్।
వరలక్ష్మీ వ్రతకథా ప్రారంభము
సూత మహాముని శౌనకుడు మొదలగు మహర్షులను జూచి ఇట్లనియె. “మునివర్యులారా! స్త్రీలకు సర్వసౌభాగ్యములు గలుగునట్టి యొక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి జెప్పెను. దానిని చెప్పెద వినుండు.
కైలాసపర్వతమున వజ్రవైఢూర్యాది మణిగణ ఖచితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుండు కూర్చిండియుండ, పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, ” దేవా! లోకంబున స్త్రీలు ఏ వ్రతంబొనర్చిన సర్వసౌభాగ్యంబులును, పుత్రపౌత్రాదులును కలిగి సుఖంబుగనుందురో, అట్టి వ్రతంబు నా కానతీయ వలయు ” ననిన నప్పరమేశ్వరుండిట్లనియె. “ఓ మనోహరీ! స్త్రీలకు పుత్రపౌత్రాది సంపత్తులు గలుగ జేసెడి వరలక్ష్మీ వ్రతంబను నొక వ్రతంబు గలదు. ఆ వ్రతంబును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారమునాడు చేయవలయు” ననిన పార్వతీదేవి ఇట్లనియే. ” ఓ లోకరాధ్యా! నీ వానతి ఇచ్చిన వరలక్ష్మీ వ్రతంబును ఎట్లు చేయవలయును? ఆ వ్రతంబునకు విధియేమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం బెవరిచే నీ వ్రతం బాచరింపబడియె? వీనినెల్ల సవివరంబుగా వచియింపవలయు”నని ప్రార్థించిన పరమేశ్వరుండు పార్వతీదేవిని గాంచి, “ఓ కాత్యాయనీ! వరలక్ష్మీ వ్రతమును సవిస్తరంబుగ జెప్పెద వినుము.
మగధ దేశంబున కుండినంబను నొక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను, బంగారు గోడలు గల ఇండ్లతోడను గూడియుండు. అట్టి పట్టణము నందు చారుమతియను నొక మహిళ గలదు. ఆ వనితామణి ప్రతిదినంబును ఉషఃకాలంబున మేల్కాంచి స్నానంబు చేసి, పెద్దలకు అనేక విధంబులైన యుపచారంబులను జేసి, ఇంటి పనులను జేసికొని, మితముగాను, ప్రియముగాను భాషించుచు నుండెను.
ఇట్లుండ ఆమె యందు మహాలక్ష్మికి యనుగ్రహము గలిగి యొకనాడు స్వప్నంబున ప్రసన్నయై, ’ఓ చారుమతీ! నేను వరలక్ష్మీ దేవిని, నీయందు నాకు అనుగ్రహము గలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారమునాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబుల నిచ్చేద’ నని వచించిన, చారుమతీదేవి స్వప్నంబులోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి
పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే
నారాయణప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా।
యనేక విధంబుల స్తోత్రము చేసి, ‘ఓ జగజ్జననీ! నీ కటాక్షంబు గలిగెనేని జనులు ధన్యులగును, విద్వాంసులుగను, సకల సంపన్నులుగను నయ్యెదరు. నేను జన్మాంతరంబున జేసిన పుణ్య విశేషం వలన నీ పాదదర్శనంబు నాకు గలిగె’ నని చెప్పిన మహాలక్ష్మి సంతోషంబు జెంది చారుమతికి ననేక వరంబులిచ్చి యంతర్థానంబు నొందె. చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి నాలుగు ప్రక్కలంజూచి వరలక్ష్మీదేవిని గానక ఓహో! నేను కలగంటిననుకొని భావించి యా స్వప్న వృత్తాంతమును పెనిమిటి, మామగారు మొదలయిన వాండ్రతో జెప్ప, వారు ఈ స్వప్నము మిగుల నుత్తమమైనది, శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మీ వ్రతం బవశ్యంబుగ జేయవలసినదని చెప్పిరి. పిమ్మట చారుమతియును, స్వప్నంబు విన్న స్త్రీలును శ్రావణమాసం బెప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందుగ వచ్చెడి శుక్రవారము వచ్చెను.
అంత చారుమతి మొదలగు స్త్రీలందరునూ ఈ దినంబే గదా వరలక్ష్మీ దేవి చెప్పిన దినంబని, ఉదయంబుననే మేల్కాంచి, స్నానంబులంజేసి, చిత్ర వస్త్రంబులం గట్టుకొని, చారుమతీదేవి గృహంబున నొక ప్రదేశమునందు గోమయంబుచే నలికి మంటపం బేర్పరిచి, యందొక ఆసనంబువైచి, దానిపై క్రొత్త బియ్యము పోసి, మర్రి చిగుళ్ళు మొదలగు పంచ పల్లవంబులచే కలశం బేర్పరచి, యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి, మిగుల భక్తియుక్తులై ధ్యానావాహనాది షోడశోపచార పూజలను జేసి, తొమ్మిది సూత్రంబులను గల తోరంబును దక్షిణహస్తంబున గట్టుకొని వరలక్ష్మీ దేవికి నానావిధ భక్ష్యభోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణంబు చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగనే ఆ స్త్రీల కొందరికి కాళ్ళ యందు ఘల్లుఘల్లుమను నొక శబ్దము గలిగే. అంత కాళ్ళం జూచికొనిన గజ్జెలు మొదలగు నాభరణములు కలిగియుండగ, వారందరును ఓహో! వరలక్ష్మీదేవి కటాక్షము వలన గలిగినవని పరమానందంబునొంది మరియొక ప్రదక్షిణంబు చేయ హస్తములందు ధగద్ధగాయ మానంబుగ పొలయుచుండు నవరత్న ఖచితంబులైన కంకణములు మొదలగు నాభరణములుండుటం గనిరి. ఇంక చెప్పనేల. మూడవ ప్రదక్షిణంబు గావించిన తోడనే యా స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. ఆ స్త్రీల గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథగజతురగ వాహనంబులతోడ నిండియుండెను. అంత నా స్త్రీలందోడ్కొని గృహంబులకు బోవుటకు వారివారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిల్చియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజచేయించిన పురోహితునికి పండ్రెండు కుడుములు వాయన దానం బిచ్చి, దక్షిణ తాంబూలంబు లొసంగి, ఆశీర్వాదంబు నొంది, వరలక్ష్మీ దేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ నెల్లరును భుజించి, తమ కొరకు వచ్చి కాచుకొనియున్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములనెక్కి తమ తమ ఇండ్లకు బోవుచూ ఒకరితో నొకరు ’ఓహో! చారుమతీదేవీ భాగ్యంబేమని చెప్పవచ్చును. వరలక్ష్మీ దేవి తనంతట స్వప్నములో వచ్చి ప్రత్యక్షంబాయెను. ఆ చారుమతీదేవి వలననే గదా మనకిట్టి మహాభాగ్య సంపత్తులు గలిగె’ నని చారుమతీదేవిని మిక్కిలి పొగుడుచూ తమ తమ ఇండ్లకు బోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరును ప్రతి సంవత్సరము నీ వ్రతంబు సేయుచూ పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ధన కనక వస్తు వాహనముల తోడం గూడుకొని సుఖంబుగనుండిరి.
కావున ఓ పార్వతీ! ఈ ఉత్తమమైన వ్రతమును అందరును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వసౌభాగ్యంబులును కలిగి సుఖంబుగ నుందురు. ఈ కథను వినువారలకును, చదువువారలకును వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యంబులు సిద్ధించును” అని పరమేశ్వరుడు పలికెను”.
ఇది భవిష్యోత్తర పురాణమునందు పార్వతీ పరమేశ్వర సంవాదమైన వరలక్ష్మీ వ్రతకథా సంపూర్ణము.


