Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026
    Facebook Instagram YouTube
    • అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత
    • 2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య
    • దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

      September 21, 2026

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026
    • భక్తి

      పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

      October 10, 2026

      అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

      October 6, 2026

      గణపతి తాళం – మూలం మరియు ప్రాముఖ్యత

      September 21, 2026

      సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • దేవాలయాలు
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » శ్రీ కనకధార స్తోత్రం/Kanaka Dhara stotram
    స్తోత్రాలు

    శ్రీ కనకధార స్తోత్రం/Kanaka Dhara stotram

    By JosyulaUpdated:August 22, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Email

    కనక ధార స్తోత్రం వినని వారంటూ ఉండరు ..
    ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు తప్పకుండా పాటించవలసిన స్తోత్రం “కనక ధార స్తోత్రం” ..

    ఈ స్తోత్రం వెనుక ఒక సంఘటన ఉంది. జగద్గురు శ్రీ ఆదిశంకరులు సన్యాసం స్వీకరించిన తర్వాత భిక్షాటన కోసం బయలుదేరి ఒక పేదరాలు ఇంటికి వెళ్ళారు ..

    ఆమె దగ్గర వేయడానికి ఏమి ఉండదు .. ఉపవాసం విరమించడానికని ఎండు ఉసరికాయ దాచుకుంటుంది . ఏమి ఇవ్వలేకపోతున్నాను అని బాధపడుతూ తన దగ్గరున్న ఏండు ఉసిరికాయను శంకరుల పాత్రలో వేస్తుంది .

    అది గమనించిన శంకరులు ఆమె కొరకు మొట్టమొదటి సరిగా లక్ష్మి దేవిని ప్రార్ధిస్తారు .. ఆ స్తోత్రమే కనకాధార స్తోత్రం చాలా శక్తివంతమైనది . లక్ష్మి దేవి కరుణించి బంగారపు వర్షం ఆ ఇంటిపై కురుపిస్తుంది.

    ఈ ప్రదేశం ప్రస్తుతం కేరళలోని pazhamthottam అనే చోట ఉంది. ఇప్పటికీ ఆ ఇల్లు పరిరక్షింపబడుతోంది .. మనం కూడా వెళ్ళి ఆ ఇంటిని చూడవచ్చు ..

    ఈ స్తోత్రమును పఠించినవారికి లక్ష్మీదేవి ప్రసన్నురాలై సర్వాభీష్ట సిద్ధి కలుగచేస్తుంది.

    అఙ్గం హరేః పులకభూషణ మాశ్రయంతీ
    భృఙ్గాఙ్గనేవ ముకుళాభరణం తమాలం
    అఙ్గీకృతాఖిల విభూతి రపాఙ్గలీలా
    మాఙ్గళ్యదాస్తు మమ మఙ్గళదేవతాయాః

    మొగ్గలతో నిండియున్న చీకటి కానుగ చెట్టుకు ఆడతుమ్మెదలు ఆభరణములైనట్లు, పులకాంకురములతోడి శ్రీహరి శరీరము నాశ్రయించినదియు, సకలైశ్వర్యములకు స్థానమైనదియు అగు లక్ష్మీదేవి యొక్క చక్కని క్రీగంటిచూపు నాకు శుభములను ప్రసాదించుగాక

    ముగ్ధాముహు ర్విదధతీ వదనే మురారేః
    ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని
    మాలా దృశో ర్మధుకరీవ మహోత్పలేయ
    సా నే శ్రియం దిశతు సాగర సంభవాయః

    పెద్ద నల్లకలువపైనుండు ఆడతుమ్మెదవలె శ్రీహరి ముఖమునందు ప్రేమ లజ్జలచే ముందుకు వెనుకకు ప్రసరించుచున్న సాగర సంజాత అయిన యా లక్ష్మీదేవి యొక్క కృపాకటాక్షము నాకు సంపదను ప్రసాదించుగాక

    ఆ మీలితాక్ష మధిగమ్య ముదా ముకుందం
    ఆనందకంద మనిమేష మనఙ్గ తంత్రం
    ఆకేకర స్థిత కనీనిక పష్మ నేత్రం
    భూత్యై భవే న్మమ భుజఙ్గ శయాఙ్గనాయాః

    నిమీలిత నేత్రుడును, ఆనందమునకు కారణభూతుడు అయిన మురారిని సంతోషముతో గూడుటచే, ఱెప్పపాటు లేనిదియు, కామ వశమైనదియు, కుచితమైన కనుపాపలును, ఱెప్పలును గలదియు అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షము నాకు సంపద నొసంగును గాక.

    భాహ్వంతరే మధుజిథ శ్రితకౌస్తుభే య
    హారావలీవ హరినీలమయీ విభాతి
    కామప్రదా భగవతోపి కటాక్షమాలా
    కల్యాణమావహతు మే కమలాలయాః

    భగవంతుడగు శ్రీహరికిని కామప్రదయై, అతని వక్షస్థలమందలి కౌస్తుభమున ఇంద్రనీలమణిమయమగు హారావళివలె ప్రకాశించుచున్న కమలాలయ అగు లక్ష్మీదేవి యొక్క కటాక్షమాల నాకు శుభమును చేకూర్చుగాక

    కాలాంబుదాలి లలితోరసి కైటభారేః
    ధారా ధరే స్ఫురతి యా తటిఙ్గ నేవ
    మాతు స్సమస్త జగతాం మహనీయ మూర్తిః
    భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః

    కారుమబ్బులపై తోచు మెరుపుతీగ వలె నీలమేఘశ్యాముడగు విష్ణుదేవుని వక్షస్థలమందు ప్రకాశించుచున్న, ముల్లోకములకును తల్లియు, భార్గవ నందనయు అగు ఆ లక్ష్మీదేవి నాకు శుభముల నిచ్చుగాక

    ప్రాప్తం పదం ప్రధమతః ఖలు యత్ప్రభావాత్
    మాఙ్గల్యభాజి మధుమాధిని మన్మధేన
    మయ్యాపతేత్తదిహ మంధర మీక్షణార్ధం
    మందాలసం చ మకరాలయ కన్యకాయాః

    ఏ క్రీగంటి ప్రభావమున మన్మధుడు మాంగల్యమూర్తియగు మధుసూదనుని యందు ముఖ్యస్థానమును ఆక్రమించెనో అట్టి క్షీరాబ్ధి కన్య అగు లక్ష్మీదేవి యొక్క మందమగు నిరీక్షము నాయందు ప్రసరించునుగాక

    విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్షం
    ఆనందహేతు రధికం మధువిధ్విషోపి
    ఈషన్నిషీదతు మయి క్షణ మీక్షణార్ధం
    ఇందీ వరోదర సహోదర మిందిరాయాః

    సమస్త దేవేంద్ర పదవి నీయగలదియు, మురవైరియగు విష్ణువు సంతోషమునకు కారణమైనదియు, నల్లకలువలను పోలునదియు అగు లక్ష్మీదేవి కటాక్షము కొంచెము నాపై నిలిచియుండును గాక

    ఇష్టా విశిష్టమతయోపి యయా దయార్ధ్ర
    దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే
    దృష్టిః ప్రవృష్ట కమలోదర దీప్తిరిష్టాం
    పుష్టిం కృషీష్ట మమ పుష్క్రవిష్తరయ

    పద్మాసని అయిన లక్ష్మీదేవి దయార్ధ దృష్టివలననే విశిష్టమతులగు హితులు సులభముగా ఇంద్రపదవిని పొందుచున్నారు. వికసిత కమలోదర దీప్తిగల ఆ దృష్టి, కోరిన సంపదను నాకు అనుగ్రహించుగాక

    దద్యాద్దయానుపవనో ద్రవిణాంభుధారా
    అస్మిన్నకించిన విహఞ్గశిశౌ విషణ్ణే
    దుష్కరమ ఘర్మ మపనీయ చిరాయ దూరం
    నారాయణ ప్రణయినీ నయనాంబువాహః

    శ్రీమన్నారాయణుని దేవి అయిన లక్ష్మీదేవి దృష్టియనెడు మేఘము దయావాయు ప్రేరితమై, నా యందు చాలాకాలముగా ఉన్న దుష్కర్మ తాపమును తొలగించి, పేదవాడ ననెడి విచారముతో ఉన్న చాతకపు పక్షి అగు నాపై ధనవర్ష ధారను కురిపించునుగాక

    గీర్దేవ తేతి గరుడధ్వజ సుందరీతి
    శాఙ్కభరీతి శశిశేఖర వల్లభేతి
    సృష్టి స్థితి ప్రళయకేళిషు సంస్థితాయ
    తస్యై నమ స్త్రిభువనైక గురో స్తరుణ్యై
    వాగ్దేవత అనియు, గరుడధ్వజ సుందరి అనియు, శాకంభరి అనియు, శశిశేఖర వల్లభా అనియు పేరు పొందినదియు, సృష్టి, స్థితి, లయముల గావించునదియు, త్రిభువనములకు గురువైన విష్ణుదేవుని పట్టమహిషి అగు లక్ష్మీదేవికి నమస్కారము.

    శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై
    రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై
    శక్త్యైనమోస్తు శతపత్ర నికేతనాయై
    పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై
    పుణ్యకార్యములు ఫలము నొసగు శ్రుతిరూపిణియు, సౌందర్య గుణసముద్ర యగు రతిరూపిణియును, పద్మనివాసిని అగు శక్తి రూపిణియు అగు లక్ష్మీదేవికి నమస్కారము.

    నమోస్తు నాళీక నిభాననాయై
    నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై
    నమోస్తు సోమామృత సోదరాయై
    నమోస్తు నారాయణ వల్లభాయై
    పద్మమును బోలిన ముఖము గలదియు, క్షీరసముద్ర సంజాతయు, చంద్రునికిని, అమృతమునకు తోబుట్టువును, నారాయణుని వల్లభయును అగు లక్ష్మీదేవికి నమస్కారము

    నమోస్తు హేమాంభుజ పీఠికాయై
    నమోస్తు భూమణ్డల నాయికాయై
    నమోస్తు దేవాది దయాపరాయై
    నమోస్తు శార్ఙ్ఙాయుధ వల్లభాయై

    బంగారు పద్మము ఆసనముగా గలదియును, భూమండలమునకు నాయిక అయినదియును, దేవతలలో దయయే ముఖముగా గలదియును, విష్ణువునకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము.

    నమోస్తు దేవ్యై భృగు నందనాయై
    నమోస్తు విష్ణోరురసి స్థితాయై
    నమోస్తు లక్ష్మ్యై కమలాలయాయై
    నమోస్తు దామోదర వల్లభాయై

    భృగుమహర్షి పుత్రికయును, దేవియు, విష్ణు వక్షస్థల వాసినియు, కమలాలయము, విష్ణువుకు ప్రియురాలును అయిన లక్ష్మీదేవికి నమస్కారము

    నమోస్తు కాంత్యై కమలేక్షణాయై
    నమోస్తు భూత్యై భువన ప్రసూత్యై
    నమోస్తు దేవాదిభి రర్చితాయై
    నమోస్తు నందాత్మజ వల్లభాయై
    తామరపువ్వు వంటి కన్నులు గలదియు, దేదీప్యమానమైనదియు, లోకములకు తల్లియు, దేవతలచే పూజింపబడునదియు, విష్ణువుకు ప్రియురాలు అగు లక్ష్మీదేవికి నమస్కారము

    సంపత్కరాణి సకలేంద్రియ నందనాని
    సామ్రాజ్య దాన విభవాని సరోరుహాక్షి
    త్వద్వందనాని దురితా హరణోద్యోతాని
    మామేవ మాత రనిశం కలయంతు మాన్యే

    పద్మములవంటి కన్నులు గల పూజ్యురాలవగు నోయమ్మా, నిన్ను గూర్చి చేసిన నమస్కృతులు సంపదను కల్గించునవి, సకలేంద్రియములకును సంతోషమును కలిగించునవి, చక్రవర్తిత్వము నొసగ గలవి, పాపములను నశింపచేయునవి, ఓ తల్లీ అవి ఎల్లపుడును నన్ను అనుగ్రహించుగాక

    యత్కటాక్ష సముపాసనా విధిః
    సేవకస్య సకలార్ధ సంపదః
    సంతనోతి వచనాఞ్గ మానసై
    త్వాం మురారి హృదయేశ్వరీం భజే
    ఏ దేవి యొక్క కటాక్ష వీక్షణమున సేవకులకు సకలార్ధ సంపదలు లభించునో, అట్టి మురారి హృదయేశ్వరి యగు లక్ష్మీదేవిని మనోవాక్కాయములచే త్రికరణశుద్ధిగా సేవింతును

    సరసిజనిలయే సరోజ హస్తే
    ధవళతమాం శుక గంధమాల్యశోభే
    భగవతి హరివల్లభే మనోఙ్ఞే
    త్రిభువనభూతి కరి ప్రసీద మహ్యం

    కమలములవంటి కన్నులు గల ఓ తల్లీ, చేతియందు పద్మమును ధరించి, తెల్లని వస్త్రము, గంధము, పుష్పమాలికలతో ప్రకాశించుచున్న భగవతీ, విష్ణుప్రియా, మనోఙ్ఞురాలా, ముల్లోకములకును సంపదను ప్రసాదించు మాతా, నన్ననుగ్రహింపుము

    దిగ్ఘస్తిభిః కనక కుంభ ముఖావసృష్ట
    స్వర్వాహినీ విమలచారు జలాప్లుతాఙ్ఞీం
    ప్రాత ర్నమామి జగతాం జననీ మశేష
    లోకాధినాధ గృహిణీ మమృతాబ్ధి పుత్రీం

    దిగ్గజములు కనకకుంభములతో తెచ్చిన వినిర్మల ఆకాశ జలములచే అభిషేకించబడిన శరీరము కలదియు, లోకములకు జననియు, విశ్వప్రభువగు విష్ణుమూర్తి గృహిణియు, క్షీరసాగర పుత్రియు అగు లక్ష్మీదేవికి ఉదయమున నమస్కరించుచున్నాను.

    కమలే కమలాక్ష వల్లభేత్వం
    కరుణాపూర తరఙ్ఞితై రపాఙ్ఞైః
    అవలోకయ మా మకిఞ్చనానాం
    ప్రధమం పాత్రమ కృత్రిమందయాయాః

    శ్రీహరి వల్లభురాలివైన ఓ లక్ష్మీదేవి, దరిద్రులలో ప్రధముడను, నీ దయకు తగిన పాత్రమును అగు నన్ను నీ కరుణాకటాక్షముతో చూడుము.

    స్తువంతి యే స్తుతిభిరమాభిరన్వహం
    త్రయీమయీం త్రిభువనమాతరం రమాం
    గుణాధికా గురుతర భాగ్యభాగినో
    భవంతి తే భువి బుధ భావితాశయాః

    ఎవరీ స్తోత్రములచే ప్రతిరోజు వేదరూపిణియు, త్రిలోకమాతయు అగు లక్ష్మీదేవిని స్తుతింతురో వారు విద్వాంసులకే భావితాశయులై, గుణాధికులై అత్యంత భాగ్యశాలురగుచున్నారు.

    సువర్ణ ధారాస్తోత్రం య చ్చఙ్కరాచార్య నిర్మితం
    త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స కుబేరసమోభవేత్

    శ్రీ శంకరాచార్యులచే రచించబడిన కనకధారాస్తోత్రమును ప్రతిరోజు, త్రికాలములందు పఠించువారు కుబేరునితో సమానుడగును…ఓం శ్రీ గురుదేవోభవ..!!

    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    అష్ట లక్ష్మీ స్తోత్రమ్/ASHTA LAKSHMI STOTRAM

    March 16, 2019

    శ్రీ రామాష్టోత్తర శత నామ స్తోత్రమ్/SREE RAMAASHTOTTARA SATA NAMA STOTRAM

    March 16, 2019

    గణపతి గకార అష్టోత్తర శతనామ స్తోత్రమ్/GANAPATI GAKARA ASHTOTTARA SATANAMA STOTRAM

    March 16, 2019
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (110)
    • అష్టోత్తరం (42)
    • గణపతి 32 నామాలు లేదా రూపాలు (32)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (7)
    • దేవి మహాత్మ్యం (17)
    • పూజ (13)
    • భక్తి (178)
    • భగవత్ గీత (18)
    • మన పండుగలు (36)
    • ముఖ్యం (2)
    • విజ్ఞానం (21)
    • స్తోత్రాలు (53)
    Don't Miss

    పోలేర అమావాస్య వ్రత కథ మరియు శ్రీ పోలేరమ్మ తల్లి అష్టోత్తర శతనామావళి – 108 నామాలు

    October 10, 2026 భక్తి

    పోలేరమ్మ తల్లి అనేక ప్రాంతాల్లో గ్రామదేవతగా భక్తిశ్రద్ధలతో పూజలందుకుంటారు. గ్రామ ప్రజల క్షేమం, కుటుంబాల శ్రేయస్సు, పంటల అభివృద్ధి, సుఖసంతోషాల…

    అక్టోబర్ 6, 2026 ఇందిరా ఏకాదశి 2026: విశిష్టత

    October 6, 2026

    2026లో పితృ పక్షం, మహాలయ అమావాస్య

    September 22, 2026

    దసరా మహోత్సవములు 2026: ఇంద్రకీలాద్రిపై శ్రీ కనకదుర్గమ్మవారి అలంకారాలు, తేదీలు మరియు ప్రసాదములు

    September 21, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.