బ్రాహ్మణో”‌உస్య ముఖ’మాసీత్ | బాహూ రా’జన్యః’ కృతః | ఊరూ తద’స్య యద్వైశ్యః’ | పద్భ్యాగ్‍మ్ శూద్రో అ’జాయతః ||

అన్నమయ్య కీర్థన ఏలే ఏలే మరదలా/ANNAMAYYA KEERTHANAS ELE ELE MARADALAA

రచన: అన్నమాచార్య ఏలే యేలే మరదలా చాలుజాలు | చాలును చాలు నీతోడి సరసంబు బావ || గాటపు గుబ్బలు గదలగ గులికేవు | మాటల దేటల మరదలా | చీటికి మాటికి జెనకేవే వట్టి | బూటకాలు మానిపోవే బావ…

అన్నమయ్య కీర్థన ఏమని పొగడుదుమే/ANNAMAYYA KEERTHANAS EMANI POGADUDUME

రచన: అన్నమాచార్య రాగం:ఆభేరి తాళం :ఆదితాళం ఏమని పొగదుడుమే యికనిను | ఆమని సొబగుల అలమేల్మంగ || తెలికన్నుల నీ తేటలే కదవే | వెలయగ విభునికి వెన్నెలలు | పులకల మొలకల పొదులివి గదవే | పలుమరు పువ్వుల పానుపులు…

అన్నమయ్య కీర్థన ఏమొకో చిగురుటధరమున/ANNAMAYYA KEERTHANAS EMOKO CHIGURUTADHARAMUNA

రచన: అన్నమాచార్య ఏమొకో చిగురుటధరమున ఎడనెడకస్తూరి నిండెను | భామిని విభునకు వ్రాసిన పత్రిక కాదు కదా || కలికి చకోరాక్షికి కడకన్నులు కెంపైతోచిన | చెలువంబిప్పుడిదేమో చింతింపరేచెలులు | నలువున ప్రాణేశ్వరునిపై నాటినయాకొనచూపులు | నిలువునపెరుకగనంటిన నెత్తురుకాదుకదా || పడతికి…

అన్నమయ్య కీర్థన ఎండ గాని నీడ గాని/ANNAMAYYA KEERTHANAS ENDA GAANI NEEDA GAANI

రచన: అన్నమాచార్య ఎండగాని నీడగాని యేమైనగాని కొండల రాయడె మాకులదైవము || తేలుగాని పాముగాని దేవపట్టయినగాని గాలిగాని ధూళిగాని కానియేమైన | కాలకూటవిషమైనా గ్రక్కున మింగిన నాటి- నీలవర్ణుడేమా నిజదైవము || చీమగాని దోమగాని చెలది యేమైనగాని గాముగాని నాముగాని కానియేమైన…

అన్నమయ్య కీర్థన గాలినే పోయ/ANNAMAYYA KEERTHANAS GAALINE POYA

రచన: అన్నమాచార్య గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు || అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు గుడుగుకొననే పట్టె గలకాలము | ఒడలికి జీవుని కొడయడైనహరి దడవగా గొంతయు బొద్దులేదు || కలచి చిందనే పట్టె గడవగ నించగ…

అన్నమయ్య కీర్థన గరుడ గమన గరుడధ్వజ/ANNAMAYYA KEERTHANAS GARUDA GAMANA GARUDADHVAJA

రచన: అన్నమాచార్య గరుడ గమన గరుడధ్వజ నరహరి నమోనమో నమో || కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణిక | కమలనయన కమలాప్తకుల నమోనమో హరి నమో నమో || జలధి బంధన జలధిశయన జలనిధి మధ్య జంతుకల | జలధిజామాత జలధిగంభీర…

అన్నమయ్య కీర్థన జయ జయ రామా/ANNAMAYYA KEERTHANAS JAYA JAYA RAAMAA

రచన: అన్నమాచార్య జయ జయ రామా సమరవిజయ రామా | భయహర నిజభక్తపారీణ రామా || జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా | అలసుగ్రీవునేలినాయోధ్యరామా కలిగి యఙ్ఞముగాచేకౌసల్యరామా || అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులను గానేకోదండరామా | ధర నహల్యపాలిటిదశరథరామా హరురాణినుతులలోకాభిరామా || అతిప్రతాపముల…

అన్నమయ్య కీర్థన జయ లక్ష్మి వర లక్ష్మి/ANNAMAYYA KEERTHANAS JAYA LAKSHMI VARA LAKSHMI

రచన: అన్నమాచార్య రాగం: లలిత జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి | ప్రియురాలవై హరికిఁ బెరసితివమ్మా || పాలజలనిధిలోని పసనైనమీఁగడ మేలిమితామరలోని మించువాసన | నీలవర్ణునురముపై నిండిననిధానమవై యేలేవు లోకములు మమ్మేలవమ్మా || చందురుతోడఁ బుట్టిన సంపదలమెఱుఁగవో కందువ బ్రహ్మలఁ గాచేకల్పవల్లి…

అన్నమయ్య కీర్థన కలిగెనిదె నాకు/ANNAMAYYA KEERTHANAS KALIGENIDE NAAKU

రచన: అన్నమాచార్య కలిగెనిదె నాకు కైవల్యము తొలుతనెవ్వరికి దొరకనిది || జయపురుషోత్తమ జయ పీతాంబర జయజయ కరుణాజలనిధి | దయ యెఱంగ నే ధర్మము నెఱగ నా క్రియ యిది నీదివ్యకీర్తనమే || శరణము గోవింద శరణము కేశవ శరణు శరణు…

అన్నమయ్య కీర్థన కంటి నఖిలాండ/ANNAMAYYA KEERTHANAS KANTI NAKHILAANDA

రచన: అన్నమాచార్య కంటి నఖిలాండ తతి కర్తనధికుని గంటి | కంటి నఘములు వీడుకొంటి నిజమూర్తి గంటి || మహనీయ ఘన ఫణామణుల శైలము గంటి | బహు విభవముల మంటపములు గంటి | సహజ నవరత్న కాంచన వేదికలు గంటి…