Close Menu

    Subscribe to Updates

    Get the latest creative news from FooBar about art, design and business.

    What's Hot

    శ్రీ విశాలాక్షీఅష్టోత్తర శతనావళి / श्री विशालाक्षी अष्टोत्तर शतनामावली / Sri Visalakshi Ashtottara shatanaavali

    September 20, 2026

    సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    దుర్గా గణపతి – శక్తి, ధైర్యం మరియు విఘ్న నివారణను ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026
    Facebook Instagram YouTube
    • శ్రీ వరసిద్ధి వినాయక వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి పూజా విధానం, పత్ర నామ, సహిత)
    • వినాయక చవితి వ్రత కథ
    • వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026
    విష్ణుముఖం | Vishnumukham
    • డౌన్లోడ్స్
    • దేవాలయాలు
    • భగవత్ గీత
    Facebook YouTube
    Subscribe
    • Home
    • మన పండుగలు

      వినాయక చవితి వ్రత కథ

      September 9, 2026

      వినాయక చవితి, సోమవారం సెప్టెంబర్ 14, 2026

      September 9, 2026

      శ్రీకృష్ణ జన్మాష్టమి – శుక్రవారం 4 సెప్టెంబర్, 2026

      August 30, 2026

      జంధ్యాల పౌర్ణమి – శుక్రవారం ఆగస్టు 28 2026

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026
    • భక్తి

      సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      సింహ గణపతి – ధైర్యం, శక్తి మరియు రక్షణను ప్రసాదించే వినాయక స్వరూపం

      September 13, 2026

      త్రిముఖ గణపతి – జ్ఞానం, వివేకం మరియు ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

      September 12, 2026

      ద్విముఖ గణపతి – జ్ఞానం, వివేకం మరియు సమతుల్యతను ప్రసాదించే వినాయక స్వరూపం

      September 12, 2026
    • విజ్ఞానం
    • డౌన్లోడ్స్

      యజ్ఞోపవీత ధారణ విధిః

      August 26, 2026

      శ్రీ వరలక్ష్మీ వ్రతకల్పము 2026 (శ్రీ పసుపు గణపతి (విఘ్నేశ్వర) పూజా విధానం సహిత)

      August 17, 2026

      శ్రీ రుద్ర నమకం/చమకం

      July 4, 2021
    • మా గురించి
    • Contact Us
    విష్ణుముఖం | Vishnumukham
    Home » భవాన్యష్టకం/Bhavanyashtakam
    భక్తి

    భవాన్యష్టకం/Bhavanyashtakam

    By JosyulaUpdated:August 22, 2026
    Share Facebook Twitter LinkedIn Email
    Follow Us
    Facebook Instagram YouTube WhatsApp
    Share
    Facebook Twitter LinkedIn Email

    న తాతో న
    మాతా న బన్ధుర్న దాతా
    న పుత్రో న పుత్రీ న
    భృత్యో న భర్తా ।
    న జాయా న విద్యా
    న వృత్తిర్మమైవ
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 1॥

    ఓ భవానీ! తల్లీ! నాకు తల్లిగాని, తండ్రిగాని, కొడుకుగాని, కూతురుగాని, యజమానిగాని, సేవకుడుగాని, భార్యగాని, బంధువుగాని, విద్యగాని, వృత్తిగాని ఏదియూ లేదు. కేవలము నీవొక్కతవే నాకు దిక్కు, నాకు దిక్కు.

    భవాబ్ధావపారే మహాదుఃఖభీరు
    పపాత ప్రకామీ
    ప్రలోభీ ప్రమత్తః ।
    కుసంసారపాశ
    ప్రబద్ధః సదాహం
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 2॥

    అమ్మా! భవానీ! కామాంధుడనై, లుబ్ధుడనై, మత్తుడనై, జన్మపాశబద్ధుడనై, తట్టుకొనలేని దుఃఖముతో మిక్కిలి భయగ్రస్తుడనై, అవ్వలియొడ్డులేని సంసారసాగరమున పడిపోయితిని. తల్లీ నీవేతప్ప నాకెవరుదిక్కు లేరు. నీవొక్కతివేదిక్కు.

    న జానామి దానం న చ ధ్యానయోగం
    న జానామి తన్త్రం న చ స్తోత్రమన్త్రమ్ ।
    న జానామి పూజాం న చ న్యాసయోగం
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 3॥

    ఓ భవానీమాత! దానము – ధ్యానము- మంత్రము – యంత్రము – పూజ – పునస్కారము – న్యాసము – యోగము – ఏదియునూ తెలియదు. నీవేతప్ప నాకు వేరే దిక్కు లేదు. నీవేదిక్కు.

    న జానామి
    పుణ్యం న జానామి తీర్థం
    న జానామి ముక్తిం
    లయం వా కదాచిత్ ।
    న జానామి భక్తిం వ్రతం వాపి మాతః
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 4॥

    అమ్మా! భవానీ! పుణ్యకార్యము లేదు, తీర్థసేవ లేదు, మోక్షోపాయము తెలియదు, జన్మరాహిత్యము తెలియదు, భక్తి మార్గము తెలియదు, ఏ వ్రతములూ నోములూ తెలియవు, తల్లీ నీవే దిక్కు నీవేదిక్కు.

    కుకర్మీ కుసఙ్గీ కుబుద్ధిః కుదాసః
    కులాచారహీనః కదాచారలీనః ।
    కుదృష్టిః కువాక్యప్రబన్ధః సదాహం
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 5॥

    తల్లీ నేనెట్టివాడననుకొనుచుంటివి. దుష్కర్మాచరణము – దుస్సాంగత్యము – దుర్బుద్ధులు – దుష్టసేవకజనము – కులాచారహీనత్వము – దురాచార తత్పరత – దురాలోచనలు – దుర్వాక్యములు ఇవి నా లక్షణములు. అందుచేత నన్నుద్ధరించుటకు నీవు తప్ప వేరే దిక్కు లేదు, లేదు.

    ప్రజేశం రమేశం మహేశం సురేశం
    దినేశం నిశీథేశ్వరం
    వా కదాచిత్ ।
    న జానామి చాన్యత్ సదాహం శరణ్యే
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 6॥

    ఓ సర్వశరణ్యా! బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరుడు, సూర్యుడు, ఇంద్రుడు, చంద్రుడు – ఇంకెందరెందరో దేవతలు ఉన్నారు. ఒక్కర్ని గురించి కూడ నేను ఎఱుగను. నాకు తెలియదు. నీవే దిక్కు తల్లీ, నీవే దిక్కు.

    వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే
    జలే చానలే పర్వతే శత్రుమధ్యే ।
    అరణ్యే శరణ్యే సదా
    మాం ప్రపాహి
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 7॥

    ఓ మాత! ఏదైన వివాదమున గాని – విషాదమునగాని – ప్రమాదమునగాని – ప్రవాసమునగాని – నీటిలోగాని – నిప్పులోగాని – కొండలమీదగాని – అడవులలోగాని – శత్రువులమధ్యగాని – ఎక్కడైనాసరే నన్ను నీవే రక్షింపవలయునమ్మా! నాకు నీవే దిక్కు అమ్మా. నీవే దిక్కు.

    అనాథో దరిద్రో జరారోగయుక్తో
    మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః ।
    విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం
    గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని ॥ 8॥

    ఓయమ్మా! నేను దరిద్రుడను. ముసలితనము – రోగములు – జాడ్యములు – నన్నాక్రమించియున్నవి. మహావిపత్సముద్రమున మునిగి యున్నాను. సర్వవిధముల కష్ట, నష్టములపాలై వున్నాను. కావున నీవే నన్ను ఉద్ధరింపవలయును. నాకు నీవే దిక్కు . నీవే దిక్కు.

    ॥ ఇతి శ్రీ శంకరాచార్య కృతం భవాన్యష్టకం సమ్పూర్ణమ్ ॥

    Share. Facebook Twitter LinkedIn Email

    ఇంకా చదవండి

    సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    సింహ గణపతి – ధైర్యం, శక్తి మరియు రక్షణను ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026
    వర్గం
    • 30 రోజులు 30 శ్లోకాలు (31)
    • అన్నమయ్య కీర్తనలు (104)
    • అష్టోత్తరం (42)
    • గణపతి 32 నామాలు లేదా రూపాలు (32)
    • డౌన్లోడ్స్ (3)
    • దేవాలయాలు (7)
    • దేవి మహాత్మ్యం (17)
    • పూజ (13)
    • భక్తి (181)
    • భగవత్ గీత (18)
    • మన పండుగలు (35)
    • ముఖ్యం (4)
    • విజ్ఞానం (21)
    • స్తోత్రాలు (53)
    Don't Miss

    శ్రీ విశాలాక్షీఅష్టోత్తర శతనావళి / श्री विशालाक्षी अष्टोत्तर शतनामावली / Sri Visalakshi Ashtottara shatanaavali

    September 20, 2026 అష్టోత్తరం

    శ్రీ విశాలాక్షీ అష్టోత్తర శతనామావళి అనేది శ్రీ విశాలాక్షీ అమ్మవారిని 108 పవిత్ర నామాలతో స్మరించి, పూజించి, ధ్యానించే భక్తి…

    సంకటహర గణపతి – కష్టాలను తొలగించి శాంతి, ధైర్యం మరియు కార్యసిద్ధిని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    దుర్గా గణపతి – శక్తి, ధైర్యం మరియు విఘ్న నివారణను ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026

    యోగ గణపతి – ఏకాగ్రత, ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రసాదించే వినాయక స్వరూపం

    September 13, 2026
    Stay In Touch
    • Facebook
    • Twitter
    • Instagram
    • YouTube
    © 2026 Vishnumukham. Designed by JSNSoft.
    • మా గురించి
    • Contact Us
    • Terms
    • Privacy Policy

    Type above and press Enter to search. Press Esc to cancel.