అన్నమయ్య కీర్థన రాముడు లోకాభిరాముడు/ANNAMAYYA KEERTHANAS RAAMUDU LOKAABHIRAAMUDU
రచన: అన్నమాచార్య రాముడు లోకాభిరాముడు త్రైలోక్య ధాముడు రణరంగ భీముడు వాడే || వరుడు సీతకు, ఫలాధరుడు మహోగ్రపు శరుడు రాక్షస సంహరుడు వాడే | స్థిరుడు సర్వగుణాకరుడు కోదండ దీక్షా గురుడు సేవకశుభకరుడు వాడే || ధీరుడు లోకైకవీరుడు సకలా…
అన్నమయ్య కీర్థన రాముడు రాఘవుడు/ANNAMAYYA KEERTHANAS RAAMUDU RAAGHAVUDU
రాగం: కానడ రాముడు రాఘవుడు రవికులు డితడు | భూమిజకు పతియైన పురుష నిధానము || అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున | పరగ జనించిన పర బ్రహ్మము | సురల రక్షింపగ అసురుల శిక్షింపగ | తిరమై ఉదయించిన దివ్య…
అన్నమయ్య కీర్థన కామధేనువిదే/ANNAMAYYA KEERTHANAS KAMADHENUVIDE
రచన: అన్నమాచార్య కామధేను విదే కల్పవృక్ష మిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు || హరినామజపమే ఆభరణంబులు పరమాత్మునినుతి పరిమళము | దరణిదరు పాదసేవే భోగము పరమంబెరిగిన ప్రపన్నులకు || దేవుని ధ్యానము దివ్యాన్నంబులు శ్రీవిభు భక్తే జీవనము | ఆవిష్ణు కైంకర్యమే…
అన్నమయ్య కీర్థన విశ్వరూపమిదివో/ANNAMAYYA KEERTHANAS VISWAROOPAMIDIVO
రచన: అన్నమాచార్య విశ్వరూపమిదివో విష్ణురూపమిదివో శాశ్వతులమైతిమింక జయము నాజన్మము || కొండవంటి హరిరూపు గురుతైన తిరుమల పండిన వృక్షములే కల్పతరువులు | నిండిన మృగాదులెల్ల నిత్యముక్తజనములు మెండుగ ప్రత్యక్షమాయె మేలువోనాజన్మము || మేడవంటి హరిరూపు మించైనపైడి గోపుర మాడనే వాలిన పక్షుల…
అన్నమయ్య కీర్థన విన్నపాలు వినవలె/ANNAMAYYA KEERTHANAS VINNAPAALU VINAVALE
రచన: అన్నమాచార్య రాగం: భూపాళం విన్నపాలు వినవలె వింత వింతలు | పన్నగపు దోమతెర పైకెత్తవేలయ్యా || తెల్లవారె జామెక్కె దేవతలు మునులు | అల్లనల్ల నంతనింత నదిగోవారే | చల్లని తమ్మిరేకులు సారసపు గన్నులు | మెల్లమెల్లనె విచ్చి మేలుకొనవేలయ్యా…
అన్నమయ్య కీర్థన విడువ విడువనింక/ANNAMAYYA KEERTHANAS VIDUVA VIDUVANINKA
రచన: అన్నమాచార్య రాగం: సూర్యకాంతం విడువవిడువనింక విష్ణుడ నీపాదములు కడగి సంసారవార్థి కడుముంచుకొనిన || పరమాత్మ నీవెందో పరాకైయున్నాను పరగ నన్నింద్రియాలు పరచినాను | ధరణిపై చెలరేగి తనువు వేసరినాను దురితాలు నలువంకఁ దొడికి తీసినను || పుట్టుగు లిట్టె రానీ…
అన్నమయ్య కీర్థన వేడుకొందామా/ANNAMAYYA KEERTHANAS VEDUKONDAAMAA
రచన: అన్నమాచార్య వేడుకొందామా వేంకటగిరి వేంకటేశ్వరుని || ఆమటి మ్రొక్కుల వాడె ఆదిదేవుడే వాడు | తోమని పళ్యాలవాడె దురిత దూరుడే || వడ్డికాసుల వాడె వనజనాభుడే పుట్టు | గొడ్డురాండ్రకు బిడ్డలిచ్చే గోవిందుడే || ఎలిమి గోరిన వరాలిచ్చే దేవుడే…
అన్నమయ్య కీర్థన వేదం బెవ్వని/ANNAMAYYA KEERTHANAS VEDAM BEVVANI
రచన: అన్నమాచార్య వేదం బెవ్వని వెదకెడివి | ఆదేవుని గొనియాడుడీ || అలరిన చైతన్యాత్మకు డెవ్వడు | కలడెవ్వ డెచట గలడనిన | తలతు రెవ్వనిని దనువియోగదశ | యిల నాతని భజియించుడీ || కడగి సకలరక్షకు డిందెవ్వడు | వడి…
అన్నమయ్య కీర్థన వందే వాసుదేవం/ANNAMAYYA KEERTHANAS VANDE VAASUDEVAM
రచన: అన్నమాచార్య వందే వాసుదేవం బృందారకాధీశ వందిత పదాబ్జమ్ || ఇందీవరశ్యామ మిందిరాకుచతటీ- చందనాంకిత లసత్చారు దేహమ్ | మందార మాలికామకుట సంశోభితం కందర్పజనక మరవిందనాభమ్ || ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం ఖగరాజ వాహనం కమలనయనమ్ | నిగమాదిసేవితం నిజరూపశేషప-…
అన్నమయ్య కీర్థన త్వమేవ శరణమ్/ANNAMAYYA KEERTHANAS TVAMEVA SARANAM
రచన: అన్నమాచార్య త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా || వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా | భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా || బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద | సులభ…
