

శ్రీ పసుపు గణపతి పూజా విధానం
(ఏ శుభకార్యం, వ్రతం లేదా పూజ ప్రారంభించే ముందు చేయవలసిన ప్రాథమిక పూజ)
1ప్రార్థనా శ్లోకాలు
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్ ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥
సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణకః ।
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ।
ధూమకేతుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః ।
వక్రతుండః శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః ।
షోడశైతాని నామాని యః పఠేచ్ఛృణుయాదపి,
విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా ।
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే ॥
అభిప్సితార్థ సిద్ధ్యర్ధం పూజతో యః సురైరపి |
సర్వవిఘ్నచ్చిదే తస్మై గణాధిపతయే నమః ||
తదేవ లగ్నం సుదినం తదేవ
తారాబలం చంద్రబలం తదేవ
విద్యాబలం దైవబలం తదేవ
లక్ష్మీపతే తేఽంఘ్రియుగం స్మరామి ||
యశ్శివో నామరూపాభ్యాం యాదేవీ సర్వమంగళా
తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతోజయమంగళమ్ ||
లాభస్తేషాం జయస్తేషాంకుత స్తేషాంపరాభవః
యేషా మిందీవరశ్యామో హృదయస్థో జనార్థనః ||
ఆపదామపహర్తారందాతారం సర్వసంపదాం
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం ||
సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్ధసాధికే
శరణ్యే త్ర్యంబికేదేవి నారాయణి నమోస్తుతే ||
2దివ్య దంపతుల నమస్కారం
ఓం శ్రీ లక్ష్మీ నారాయణాభ్యాం నమః ||
శ్రీ ఉమామహేశ్వరాభ్యాం నమః||
శ్రీ వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః ||
శ్రీ శచీ పురందరాభ్యాం నమః ||
శ్రీ అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః ||
శ్రీ సీతారామాభ్యాం నమః ||
శ్రీ సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమః ||
3దీపారాధన
భో దీప దేవి రూపస్త్వం కర్మసాక్షిహ్యవిఘ్నకృత్
యావత్ పూజాం కరిష్యామి తావత్వంసుస్థిరో భవ
దీపారాధన ముహూర్తః సుముహూర్తోస్తు
4ఆచమనం
ఓం ఆచమ్య – ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం హృషీకేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షజాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం అచ్యుతాయ నమః, ఓం జనార్ధనాయ నమః, ఓం ఉపేంద్రాయ నమః, ఓం హరయే నమః, ఓం శ్రీకృష్ణాయ నమః, ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః ।
ఉత్తిష్ఠంతు | భూత పిశాచా | యే తే భూమిభారకాః | యే తేషా మవిరోధేన | బ్రహ్మకర్మ సమారభే | ఓం భూర్భువస్సువః | దైవీ గాయత్రీ చందః ప్రాణాయామే వినియోగః
5ప్రాణాయామః
ఓం భూః | ఓం భువః | ఓగ్‍మ్ సువః | ఓం మహః | ఓం జనః | ఓం తపః | ఓగ్‍మ్ సత్యమ్ | ఓం తథ్స’వితుర్వరే”ణ్యం భర్గో’ దేవస్య’ ధీమహి | ధియో యో నః’ ప్రచోదయా”త్ || ఓమాపో జ్యోతీ రసోஉమృతం బ్రహ్మ భూ-ర్భువ-స్సువరోమ్ ||
6సంకల్పం
మమ ఉపాత్త దురితక్షయ ద్వారా, శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభతిథౌ శోభన ముహూర్తే ఆధ్యబ్రాహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబుద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ/ఉత్తర దిగ్భాగే స్వ గృహే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానే ప్రభవాది షష్టి సంవత్సరాణాం మధ్యే శ్రీ పరాభవ నామ సంవత్సరే దక్షిణాయనే, శరద్ ఋతౌ, కార్తీక మాసే,
శుక్లపక్షే – పౌర్ణమి ముందు లేదా కృష్ణ పక్షే అమావాస్య ముందు, <<ఆ రోజు తిధి>> తిధౌ, <<ఆ రోజు వారం>> [పంచాంగం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి ] వాసరయుక్తాయాం, శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణ విశేషణ విశిష్టాయా మస్యాం శుభతిధౌ శ్రీమాన్ (మీ గోత్రం పేరు) గోత్రహ (మీ పేరు) నామ దేయహ ధర్మ పత్ని సమేతహ అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయాభయాయు రారోగ్యైశ్వర్యాభి వృద్ధ్యర్థం, ధర్మార్థకామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫలావాప్త్యర్థం సమస్త దూరితోప శాంత్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ కేదారేశ్వర ముద్దిశ్య శ్రీ కేదారేశ్వర దేవతా ప్రీత్యర్థం స్కాంద పురాణ భవిష్యదుత్తరపురాణ కల్పోక్త ప్రకారేణ యావచ్ఛక్తి ధ్యానా వాహనాది షోడశోపచార పూజాం కరిష్యే –
తదంగత్వేన కలశపూజాం కరిష్యే-
కలశం గంధ పుష్పాక్షతైరభ్యర్చ్య కలశస్యోపరిహస్తంనిధాయ.
7కలశారాధన (కలశ పూజ)
కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్సమాశ్రితః
మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృ గణాస్మృతాః
కుక్షౌతు సాగరాస్సర్వే సప్త ద్వీపా వసుంధరా
ఋగ్వేదోథ యజుర్వేదో స్సామవేదో హ్యధర్వణః
అంగై శ్చ సహితాస్సర్వే కలశాంబు సమాశ్రితాః
గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతీ
నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు
ఆయాంతు దేవ పూజార్థం దురితక్షయ కారకాః
అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా |
యః స్మరేత్ పుండరీకాక్షం స బాహ్యాభ్యంతరః శుచిః ||
✦ కొంచెం కలశం లోని జలమును పూజా ద్రవ్యాల మీద చల్లుతూ , దేవుడి మీద చల్లి, తమ మీద చల్లుకుని
పూజాద్రవ్యాణి దేవం ఆత్మానం సంప్రోక్ష్య
8శ్రీ హరిద్రా గణపతి పూజ
అధ శ్రీ హరిద్రా గణపతి పూజాం కరిష్యే
ధ్యానం : శ్రీ మహాగణాధిపతయే నమః ధ్యానం – ధ్యానం సమర్పయామి.
ఆవాహనం : శ్రీ మహాగణాధిపతయే నమః ఆవాహయామి.
ఆసనం : శ్రీ మహాగణాధిపతయే నమః ఆసనం సమర్పయామి.
పాద్యం : శ్రీ మహాగణాధిపతయే నమః పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం : శ్రీ మహాగణాధిపతయే నమః అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనం : శ్రీ మహాగణాధిపతయే నమః ఆచమనీయం సమర్పయామి.
మధుపర్కం : శ్రీ మహాగణాధిపతయే నమః మధుపర్కం సమర్పయామి.
పంచామృత స్నానం : శ్రీ మహాగణాధిపతయే నమః పంచామృత స్నానం సమర్పయామి.
శుద్ధోదక స్నానం : శ్రీ మహాగణాధిపతయే నమః శుద్ధోదకస్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం : శ్రీ మహాగణాధిపతయే నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
ఉపవీతం : శ్రీ మహాగణాధిపతయే నమః ఉపవీతం సమర్పయామి.
గంధం : శ్రీ మహాగణాధిపతయే నమః గంధాన్ సమర్పయామి.
అక్షతలు : శ్రీ మహాగణాధిపతయే నమః అక్షతాన్ సమర్పయామి.
పుష్ప సమర్పణ : శ్రీ మహాగణాధిపతయే నమః పుష్పాణి సమర్పయామి.
9శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః
- ఓం సుముఖాయ నమః
- ఓం ఏకదంతాయ నమః
- ఓం కపిలాయ నమః
- ఓం గజకర్ణకాయ నమః
- ఓం లంబోదరాయ నమః
- ఓం వికటాయ నమః
- ఓం విఘ్నరాజాయ నమః
- ఓం గణాధిపాయ నమః
- ఓం ధూమకేతవే నమః
- ఓం గణాధ్యక్షాయ నమః
- ఓం ఫాలచంద్రాయ నమః
- ఓం గజాననాయ నమః
- ఓం వక్రతుండాయ నమః
- ఓం శూర్పకర్ణాయ నమః
- ఓం హేరంబాయ నమః
- ఓం స్కందపూర్వజాయ నమః
నానా విధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి
10ధూప దీప నైవేద్య నీరాజనాలు
ధూపం : శ్రీ మహాగణాధిపతయే నమః ధూప మాఘ్రాపయామి.
దీపం : శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి.
నైవేద్యం : శ్రీ మహాగణాధిపతయే నమః నైవేద్యం సమర్పయామి.
స్వర్ణపుష్పం : శ్రీ మహాగణాధిపతయే నమః స్వర్ణ పుష్పం సమర్పయామి
తాంబూలం : శ్రీ మహాగణాధిపతయే నమః తాంబూలం సమర్పయామి.
నీరాజనం : శ్రీ మహాగణాధిపతయే నమః నీరాజనం సమర్పయామి.
11మంత్రపుష్పం & సమర్పణ
గణాధిప నమస్తుభ్యం ఉమాపుత్ర గజానన,
వినయకేశతనయ సర్వసిద్ధి ప్రదాయక ।
ఏకదంతైకవదన తథా మూషిక వాహన
కుమారగురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం ॥
మంత్రపుష్పం సమర్పయామి.
మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర |
యత్ పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తు మే ||
అనయా మయా కృత షోడశోపచార పూజాం శ్రీ మహా గణపతి దేవతార్పణమస్తు
సమస్త దురితోప శమనార్థం శ్రీ మహా గణపతి ప్రసాదం శిరసా గృహ్నామి
✦ దేవునిపై అక్షతలు తీసుకొని శిరస్సుపై ఉంచాలి
12పసుపు వినాయకుని యథాస్థాన ఉద్వాసన
ఓం యథాస్థానం ప్రతిష్ఠాపయామి ।
శ్రీ మహాగణాధిపతయే నమః ।
యథాస్థానం ఉద్వాసయామి ।
శోభనార్థే క్షేమాయ పునరాగమనాయ చ ॥
✦ పసుపు వినాయకుని పీఠమును మూడు మార్లు కదిపి పక్కన ఉంచవలెను
కేదారేశ్వర వ్రతకల్పము
శ్రీ కేదారేశ్వర షోడశోపచార పూజ
13షోడశోపచార పూజ
పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ కేదారేశ్వర పూజామారంభేత్.
ధ్యానమ్
శూలం డమరుకంచైవ దధానం హస్తయుగ్మకే,
కేదారదేవ మీశానం ధ్యాయే త్రిపురఘాతినం.
కేదారేశ్వరాయ నమః ధ్యాయామి.
ఆవాహనం
కైలాసశిఖరే రమ్యే పార్వత్యా సహిత ప్రభో,
ఆగచ్ఛ దేవదేవేశ మద్భక్త్యా చంద్రశేఖర.
కేదారేశ్వరాయ నమః ఆవాహయామి.
ఆసనం
సురాసురశిరోరత్న ప్రదీపిత పదాంబుజ,
కేదారదేవ మద్దత్త మాసనం ప్రతిగృహ్యతామ్.
కేదారేశ్వరాయ నమః ఆసనం సమర్పయామి.
పాద్యం
గంగాధర నమస్తేస్తు త్రిలోచన వృషధ్వజ,
మౌక్తికాసన సంస్థాయ కేదారాయ నమోనమః.
కేదారేశ్వరాయ నమః పాద్యం సమర్పయామి.
అర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యాదత్తం మహేశ్వరః,
ప్రయచ్ఛమే మనస్తుష్టిం భక్తానామిష్టదాయకం.
కేదారేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి.
ఆచమనం
మునిభిర్నారద ప్రఖ్యై ర్నిత్యమాఖ్యాతవైభవ,
కేదారదేవ భగవన్ గృహాణాచమనం విభో.
కేదారేశ్వరాయ నమః ఆచమనం సమర్పయామి.
మధుపర్కం
కేదారదేవ భగవన్ సర్వలోకేశ్వర ప్రభో,
మధుపర్కం ప్రదాస్యామి గృహాణత్వం శుభానఘై.
కేదారేశ్వరాయ నమః మధుపర్కం సమర్పయామి.
పంచామృతస్నానం
స్నానం పంచామృతైర్దేవ తతశ్శుద్ధోదకై రపి,
గృహాణ గౌరీరమణ తద్భక్తేన మయార్పితమ్.
కేదారేశ్వరాయ నమః పంచామృత స్నానం సమర్పయామి.
శుద్ధోదక స్నానం
నదీజలం సమాయుక్తం మయాదత్త మనుత్తమం,
స్నానం స్వీకురు దేవేశ సదాశివ నమోస్తుతే.
కేదారేశ్వరాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి.
వస్త్రయుగ్మం
వస్త్రయుగ్మం సదాశుభ్రం మనోహర మిదం శుభం,
దదామి దేవదేవేశ భక్త్యేదం ప్రతిగృహ్యతామ్.
కేదారేశ్వరాయ నమః వస్త్రయుగ్మం సమర్పయామి.
యజ్ఞోపవీతం
స్వర్ణయజ్ఞోపవీతం చ కాంచనం చోత్తరీయకం,
రుద్రాక్షమాలయా యుక్తం దదామి స్వీకురు ప్రభో.
కేదారేశ్వరాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి.
గంధం
సమస్త గంధ ద్రవ్యాణాం దేవత్వమసి జన్మభూః,
భక్త్యా సమర్పితం ప్రీత్యా మధుగంధాది గృహ్యతామ్.
కేదారేశ్వరాయ నమః గంధాన్ సమర్పయామి.
అక్షతాన్
అక్షతోఽసి స్వభావేన భక్తానా మక్షతం పదం,
దదాసి నాథ మద్దత్తే రక్షతైః ప్రీయతాం భవాన్.
కేదారేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి.
పుష్పపూజ
కల్పవృక్షప్రసూనై స్వం పూర్వైరభ్యర్చితస్సురైః,
కుంకుమై పార్థివై రేభి రిదానీ మర్చతాం మయా.
కేదారేశ్వరాయ నమః పుష్పాణి సమర్పయామి.
తతః ఇంద్రాది లోకపాలకపూజాం కుర్యాత్.
శివస్య దక్షిణేభాగే బ్రహ్మణే నమః. ఉత్తరభాగే విష్ణవే నమః,
మధ్యే కేదారేశ్వరాయ నమః.
14అంగపూజ
అథ అంగపూజా
- ఓం మహేశ్వరాయ నమః పాదౌ పూజయామి
- ఓం ఈశ్వరాయ నమః జంఘే పూజయామి
- ఓం కామరూపాయ నమః జానునీ పూజయామి
- ఓం హరాయ నమః ఊరూం పూజయామి
- ఓం త్రిపురాంతకాయ నమః గుహ్యం పూజయామి
- ఓం భవాయ నమః కటిం పూజయామి
- ఓం గంగాధరాయ నమః నాభిం పూజయామి
- ఓం మహాదేవాయ నమః ఉదరం పూజయామి
- ఓం పశుపతయే నమః హృదయం పూజయామి
- ఓం పినాకినే నమః హస్తాన్ పూజయామి
- ఓం శివాయ నమః భుజౌ పూజయామి
- ఓం శితికంఠాయ నమః కంఠం పూజయామి
- ఓం విరూపాక్షాయ నమః ముఖం పూజయామి
- ఓం త్రినేత్రాయ నమః నేత్రాన్ పూజయామి
- ఓం రుద్రాయ నమః లలాటం పూజయామి
- ఓం శర్వాయ నమః శిరః పూజయామి
- ఓం చంద్రమౌళయే నమః మౌళిం పూజయామి
పశుపతయే నమః సర్వాణ్యంగాని పూజయామి.
15అష్టోత్తర శతనామ పూజ
అథాష్టోత్తర శత నామ పూజా
- ఓం శివాయ నమః
- ఓం మహేశ్వరాయ నమః
- ఓం శంభవే నమః
- ఓం పినాకినే నమః
- ఓం శశిశేఖరాయ నమః
- ఓం వామదేవాయ నమః
- ఓం విరూపాక్షాయ నమః
- ఓం కపర్దినే నమః
- ఓం నీలలోహితాయ నమః
- ఓం శంకరాయ నమః10
- ఓం శూలపాణినే నమః
- ఓం ఖట్వాంగినే నమః
- ఓం విష్ణువల్లభాయ నమః
- ఓం శిపివిష్టాయ నమః
- ఓం అంబికానాథాయ నమః
- ఓం శ్రీకంఠాయ నమః
- ఓం భక్తవత్సలాయ నమః
- ఓం భవాయ నమః
- ఓం శర్వాయ నమః
- ఓం త్రిలోకేశాయ నమః20
- ఓం శితికంఠాయ నమః
- ఓం శివాప్రియాయ నమః
- ఓం ఉగ్రాయ నమః
- ఓం కపాలినే నమః
- ఓం కామారినే నమః
- ఓం అంధకాసురసూదనాయ నమః
- ఓం గంగాధరాయ నమః
- ఓం లలాటాక్షాయ నమః
- ఓం కాలకాలాయ నమః
- ఓం కృపానిధయే నమః30
- ఓం భీమాయ నమః
- ఓం పరశుహస్తాయ నమః
- ఓం మృగపాణినే నమః
- ఓం జటాధరాయ నమః
- ఓం కైలాసవాసినే నమః
- ఓం కవచినే నమః
- ఓం కఠోరాయ నమః
- ఓం త్రిపురాంతకాయ నమః
- ఓం వృషాంకాయ నమః
- ఓం వృషభారూఢాయ నమః40
- ఓం భస్మోద్ధూళితవిగ్రహాయ నమః
- ఓం సామప్రియాయ నమః
- ఓం సర్వమయాయ నమః
- ఓం త్రయీమూర్తయే నమః
- ఓం అనీశ్వరాయ నమః
- ఓం సర్వజ్ఞాయ నమః
- ఓం పరమాత్మాయ నమః
- ఓం సోమసూర్యాగ్నిలోచనాయ నమః
- ఓం హవిషే నమః
- ఓం యజ్ఞమయాయ నమః50
- ఓం సోమాయ నమః
- ఓం పంచవక్త్రాయ నమః
- ఓం సదాశివాయ నమః
- ఓం విశ్వేశ్వరాయ నమః
- ఓం వీరభద్రాయ నమః
- ఓం గణనాథాయ నమః
- ఓం ప్రజాపతయే నమః
- ఓం హిరణ్యరేతాయ నమః
- ఓం దుర్ధర్షాయ నమః
- ఓం గిరిశాయ నమః60
- ఓం గిరీశాయ నమః
- ఓం అనఘాయ నమః
- ఓం భుజంగభూషణాయ నమః
- ఓం భర్గాయ నమః
- ఓం గిరిధన్వినే నమః
- ఓం గిరిప్రియాయ నమః
- ఓం కృత్తివాసాయ నమః
- ఓం పురారాతయే నమః
- ఓం భగవతే నమః
- ఓం ప్రమథాధిపాయ నమః70
- ఓం మృత్యుంజయాయ నమః
- ఓం సూక్ష్మతనవే నమః
- ఓం జగద్వ్యాపినే నమః
- ఓం జగద్గురవే నమః
- ఓం వ్యోమకేశాయ నమః
- ఓం మహాసేనజనకాయ నమః
- ఓం చారువిక్రమాయ నమః
- ఓం రుద్రాయ నమః
- ఓం భూతపతయే నమః
- ఓం స్థాణవే నమః80
- ఓం అహిర్బుధ్నాయ నమః
- ఓం దిగంబరాయ నమః
- ఓం అష్టమూర్తయే నమః
- ఓం అనేకాత్మాయ నమః
- ఓం సాత్త్వికాయ నమః
- ఓం శుద్ధవిగ్రహాయ నమః
- ఓం శాశ్వతాయ నమః
- ఓం ఖండపరశవే నమః
- ఓం అజాయ నమః
- ఓం పాశవిమోచకాయ నమః90
- ఓం మృడాయ నమః
- ఓం పశుపతయే నమః
- ఓం దేవాయ నమః
- ఓం మహాదేవాయ నమః
- ఓం అవ్యయాయ నమః
- ఓం హరియే నమః
- ఓం పూషదంతభేత్రే నమః
- ఓం అవ్యగ్రాయ నమః
- ఓం దక్షాధ్వరహరాయ నమః
- ఓం హరాయ నమః100
- ఓం భగనేత్రభిదే నమః
- ఓం అవ్యక్తాయ నమః
- ఓం సహస్రాక్షాయ నమః
- ఓం సహస్రపాదవే నమః
- ఓం అపవర్గప్రదాయ నమః
- ఓం అనంతాయ నమః
- ఓం తారకాయ నమః
- ఓం పరమేశ్వరాయ నమః108
అష్టోత్తర శతనామ పూజా సమర్పయామి.
16ఏకవింశతి గ్రంథి పూజ
శ్రీ కేదారేశ్వరాయ నమః
- ఓం శివాయ నమః – ప్రథమగ్రంథిం పూజయామి
- ఓం శాంతాయ నమః – ద్వితీయగ్రంథిం పూజయామి
- ఓం మహాదేవాయ నమః – తృతీయగ్రంథిం పూజయామి
- ఓం వృషభధ్వజాయ నమః – చతుర్థగ్రంథిం పూజయామి
- ఓం గౌరీశాయ నమః – పంచమగ్రంథిం పూజయామి
- ఓం రుద్రాయ నమః – షష్ఠమగ్రంథిం పూజయామి
- ఓం పశుపతయే నమః – సప్తమగ్రంథిం పూజయామి
- ఓం భీమాయ నమః – అష్టమగ్రంథిం పూజయామి
- ఓం త్ర్యంబకాయ నమః – నవమగ్రంథిం పూజయామి
- ఓం నీలలోహితాయ నమః – దశమగ్రంథిం పూజయామి
- ఓం హరాయ నమః – ఏకాదశగ్రంథిం పూజయామి
- ఓం స్మరహరాయ నమః – ద్వాదశగ్రంథిం పూజయామి
- ఓం భర్గాయ నమః – త్రయోదశగ్రంథిం పూజయామి
- ఓం స్వయంభువే నమః – చతుర్దశగ్రంథిం పూజయామి
- ఓం శర్వాయ నమః – పంచదశగ్రంథిం పూజయామి
- ఓం సదాశివాయ నమః – షోడశగ్రంథిం పూజయామి
- ఓం ఈశ్వరాయ నమః – సప్తదశగ్రంథిం పూజయామి
- ఓం ఉగ్రాయ నమః – అష్టాదశగ్రంథిం పూజయామి
- ఓం శ్రీకంఠాయ నమః – ఏకోనవింశతిగ్రంథిం పూజయామి
- ఓం నీలకంఠాయ నమః – వింశతిగ్రంథిం పూజయామి
- ఓం కేదారేశ్వరాయ నమః – ఏకవింశతిగ్రంథిం పూజయామి
నానావిధ పరిమళ పుష్పాణి సమర్పయామి.
17ధూపం · దీపం · నైవేద్యం · ప్రార్థన
ధూపం
దశాంగ ధూపముఖ్యంచ హ్యంగార వినివేశితం,
ధూపం నుగంధై రుత్పన్నం త్వాం ప్రీణయతు శంకర.
కేదారేశ్వరాయ నమః ధూపమాఘ్రాపయామి.
దీపం
యోగినాం హృదయే నైవజ్ఞానదీపాం కురోష్యసి,
బాహ్యదీపో మయాదత్తః గృహ్యతాం భక్తగౌరవాత్.
కేదారేశ్వరాయ నమః దీపం దర్శయామి.
నైవేద్యం
త్రైలోక్యమపి నైవేద్యం న తే తృప్తిస్తథా బహిః,
నైవేద్యం భక్తవాత్సల్యాద్గృహ్యతాం త్ర్యంబకంత్వయా.
కేదారేశ్వరాయ నమః నైవేద్యం సమర్పయామి.
తాంబూలం
నిత్యానందస్వరూపస్త్వం యోగిహృత్కమలే స్థితః,
గృహాణ భక్త్యా మద్దత్తం తాంబూలం ప్రతిగృహ్యతామ్.
కేదారేశ్వరాయ నమః తాంబూలం సమర్పయామి.
పునరర్ఘ్యం
అర్ఘ్యం గృహాణ భగవన్ భక్త్యాదత్తం మహేశ్వర,
ప్రయచ్ఛ మే మనస్తుష్టిం భక్తానా మిష్టదాయకం.
కేదారేశ్వరాయ నమః పునరర్ఘ్యం సమర్పయామి.
నీరాజనం
కర్పూరం చంద్రసంకాశం జ్యోతిస్సూర్యమివోదితం,
భక్త్యా దాస్యామి కర్పూర నీరాజన మిదం శివ.
కేదారేశ్వరాయ నమః నీరాజనం సమర్పయామి.
ప్రదక్షిణం
భూతేశ భువనాధీశ సర్వదేవాదిపూజిత,
ప్రదక్షిణం కరోమి త్వాం వ్రతం మే సఫలం కురు.
కేదారేశ్వరాయ నమః ప్రదక్షిణం సమర్పయామి.
నమస్కారాన్
హరః శంభో మహాదేవ విశ్వేశామర వల్లభ,
శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే.
కేదారేశ్వరాయ నమః నమస్కారాన్ సమర్పయామి.
ప్రార్థన
అభీష్టసిద్ధిం కురు మే శివావ్యయ మహేశ్వర,
భక్తానాం వరదానార్థం మూర్తీకృత కళేబర.
కేదారేశ్వరాయ నమః ప్రార్థయామి.
18సూత్రగ్రహణం · తోరబంధనం · వాయనదానం
సూత్రగ్రహణం
కేదార దేవదేవేశ భగవ న్నంబికాపతే,
ఏకవింశ ద్దినేతస్మిన్ సూత్రం గృహ్ణామ్యహం ప్రభో.
సూత్రగ్రహణంకరిష్యే.
తోరబంధన మంత్రం
ఆయుశ్చ విద్యాంచ తథా సుఖం చ
సౌభాగ్యవృద్ధిం కురు దేవదేవ,
సంసార ఘోరాంబునిధౌ నిమగ్నం
మాం రక్ష కేదార నమో నమస్తే.
తోరబంధనంకరిష్యే.
వాయనదానం
కేదారః ప్రతిగృహ్ణాతు కేదారో వైదదాతి చ,
కేదారస్తారకోభాభ్యాం కేదారాయ నమోనమః.
వాయనదానం కరిష్యామి.
ప్రతిమాదానం
కేదారః ప్రతిమాం యస్మాద్రాజ్యం సౌభాగ్యవర్ధినీ,
తస్మాదస్యాః ప్రదానేన మమాస్తు శ్రీరచంచలా.
ఇతి ప్రతిమాదానమంత్రః.
ఇతి పూజావిధానం సంపూర్ణమ్.
కేదారేశ్వర వ్రత కథా ప్రారంభము
స్కాంద పురాణాంతర్గతం
19కేదారేశ్వర వ్రత కథ
సూతపౌరాణికుండు శౌనకాది మహర్షులం గాంచి యిట్లనియె. ఋషి పుంగవులారా! మానవులకు సర్వసౌభాగ్యముల గలుగంజేయునదియు, పార్వతీదేవిచే సాంబ శివుని శరీరార్థము పొందినదియునగు కేదారేశ్వర వ్రతమనునదొకటి గలదు. ఆ వ్రతవిధానమును వివరించెద వినుండు. దీనిని బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రాదులాచరించవచ్చును. ఈ వ్రతమును ఇరువదియొక్క మారులాచరించువారు సకల సంపదలనుభవించి పిదప శివసాయుజ్యము నొందుదురు.
ఓ మునిశ్రేష్ఠులారా! ఈ వ్రతమాహాత్మ్యమును వివరించెద వినుండు. భూలోకంబునం దీశాన్యభాగమున మెఱుపుగుంపులతో గూడియున్న శరత్కాల మేఘములం బోలు నిఖిలమణివిచిత్రంబైన శిఖరములచేతను, పలుతెఱంగులైన లతావిశేషములచేతను, బహువిధములగు పుష్ప ఫలాదులచేతను, నానావిధములైన పక్షులచేతను, మరియు ననేకములైన కొండకాలువలచేతను వ్యాప్తంబయి, సాలతమాల రసాల హింతాల వకుళాశోక చందన దేవదారు నారికేళ ఆమ్ర పనస నాగపున్నాగ చంపకాది వృక్షములచేతను, నానాతరు విశేషములచేతను భాసిల్లునట్టి ఉద్యాన వనములచేత ప్రకాశించుచు, నిఖిల కల్యాణప్రదంబై, సర్వజన నమస్కృత్యంబై, కైలాసమని పేర్కొనంబడిన ఒక పర్వతశ్రేష్ఠము గలదు.
అంత షడ్గుణైశ్వర్య సంపన్నులును, మహామహనీయులు నగు యోగులచేతను, సిద్ధ గంధర్వ కిన్నర కింపురుషాదులచేతను సేవింపబడి, మనోహరంబైయున్న యా పర్వత శిఖరమందు జగత్కర్తయైన పరమేశ్వరుండు ప్రమథగణములచే పరివేష్టింపబడి, భవానీ సమేతుండై, సకల దేవమునిబృందములచేత నమస్కరింపబడుచు, ప్రసన్నుండై కూర్చుండి, యొక సమయమున చతుర్ముఖాది దేవతల కందరికి దర్శనమిచ్చెను.
అంత సూర్యాగ్ని పవనులు, నక్షత్రయుక్తుండయిన నిశాకరుండును, మరియు నింద్రాది దేవతలును, వసిష్ఠాది మహర్షులును, రంభ మొదలగు అప్సరసలును, బ్రహ్మీ మొదలగు సప్తమాతృకలును, సేనానియు, గణపతియును, దత్సారూప్యమును బొందియున్న నంది భృంగి మొదలగు ప్రమథ గణములును దన్ను పరివేష్టించి కొలుచుచుండ, నట్టి భవానీవల్లభుని యత్యద్భుతంబగు సభయందు నారదుడు మొదలగు దేవగాయకులు స్వామి అనుజ్ఞవడసి గానము చేసిరి. అట్టి రమణీయంబును శ్రావ్యంబునగు గానము ప్రవర్ధిల్లుచుండగా, ఘృతాచీ మేనకాదులు వీణాది చతుర్విధ వాద్యములతో, లయలతో కూడిన నృత్యమొనర్చిరి.
అప్పుడా వేల్పు బానిసలలోన మిక్కిలి సాగసుకత్తెయగు రంభ నిఖిల సురబృందముల యొక్క యుల్లములు రంజిల్లునటుల నాట్యమొనరించెను. ఆ సమయమున భృంగిరిటి యనెడి భక్తవరుండు ఆ స్వామి సన్నిధియం దాయనకు ప్రీతి కల్గునట్లుగా వికట నాట్యము చేయగా అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాస్యము జనించెను. అటువంటి ఆశ్చర్యంబగు హాసముల వలన నప్పుడా పర్వత గుహలు నిండునటుల గొప్ప కలకల ధ్వని కలిగెను.
ఇట్లు హాస్యము విస్తరిల్లుచుండ సర్వేశ్వరుండగు శంకరుండు ఆ భృంగిరిటినిం జూచి నీచేత మిగుల హర్షప్రవర్ధంబైన నాట్యము చేయబడెనని సెలవిచ్చి ముదంబంది యా భక్తుని అనుగ్రహించెను. అంతట నా భృంగిరిటికి శివానుగ్రహంబు గలుగుటం చేసి యతండు ప్రీతుండై సకల విబుధులచే గౌరవింపబడి సమాహితచిత్తుండై వినయంబుతో గూడి, యా పార్వతీదేవిని వదలి, ఈశ్వరునికి మాత్రము ప్రదక్షిణ నమస్కారము లొనరించెను. అప్పుడు పార్వతి చిరునగవుతో గూడినదై తన పతియగు పరమేశ్వరుని వీక్షించి “ఓ స్వామీ! ఈ భృంగిరిటి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణము నాచరించుటకు కారణమేమి! వినవేడుకగా నున్నది. ఆనతీయవే” యని వేడగా నా సదాశివుడు “ఓ ప్రియురాలా! చెప్పెద వినుము. పరమార్థ విదులగు యోగులకు నీవలనం బ్రయోజనంబు లేమింజేసి, నాకు మాత్రమే నమస్కరించె” నని చెప్పెను.
ఆ మాటలకు పరమేశ్వరి మిగుల వ్రీడనుపొంది, భర్తయందున్న తన శక్తి నాకర్షించుచగా నాస్వామి త్వగ స్థ్వ్యావశిష్ట మా త్రావయవుండాయె. అంత నాదేవియు సారహీనురాలై వికటురాలాయెను. పిదప నాదేవి కోపించి దేవతల చేత నూరడింపబడినదైనను, కైలాసమును వదలి తపంబొనరించుటకు బహువిధంబులగు సింహ శరభ శార్దూల గజమృగాదులచే సేవింపబడునదియు నిత్యవైర ముడిగియున్న పన్నగ గరుడాది సకల జంతువులచే నిబిడంబగు నదియు, నానావిధ వృక్షలతా గుల్మాది భూయిష్టంబయి ఋషిశ్రేష్ఠ సేవితంబై సర్వాభీష్టప్రదంబై యొప్పుచున్న గౌతమాశ్రమమును ప్రవేశించెను.
అంత నా గౌతముండు వన్యంబులై హోమయోగ్యంబులగు సమిత్కుశ ఫలాదులను సంగ్రహించుకొని వనమునుండి వచ్చునెడ దన యాశ్రమ భాగమున వెలుగుచున్న ప్రకాశమును జూచి ఋష్యాశ్రమం బగునిది ఇట్లు శోభిల్లుచున్నదేమా యని విస్మయం బంది దత్కారణము చింతించుచు ఆశ్రమము ప్రవేశించి తామర రేకులవంటి కన్నులు గలిగి యలంకృతురాలై యున్న యా మహేశ్వరిం గనుగొని “పూజ్యురాలవైన ఓ భగవతీ! నీ విచ్చుటి కేతెంచుటకు కారణంబే” మని అడుగగా, నా దేవియు ఆ జడదారికి తన విషాద కారణమును వచించి నమస్కరించి, “ఓ మునీశ్వరా! ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో, యే వ్రతానుష్ఠానముచేత శంకర దేహార్ధము నాకు ఘటించునో అటువంటి వ్రతము నుపదేశింపుము” అనగా ఆ మహర్షి సకల శాస్త్రపురాణావలోకనం బాచరించి యాప్సితార్థప్రదంబగు శ్రీమత్కేదార నామకంబయిన ఉత్తమ వ్రతము నాచరింపుమని ఉపదేశించెను. అంత నా దేవియు నావ్రతానుష్ఠానక్రమము ఆనతీయవే యని వేడగా ఇటులని చెప్పదొడంగెను.
“అమ్మా! భాద్రపద శుక్లాష్టమియందు శుద్ధమనస్కారాలవై మంగళకరములగు నేకవింశతి తంతువులచేత హస్తమునందు ప్రతిసరమును ధరించి, పూజించి, యా దినమందు ఉపవాస మొనరించి, మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి, అది మొదలు అమావాస్య వరకు నీవ్రతము నిటుల సలుపుచు ప్రతిదినము నందును శ్రీమత్కేదార దేవునిగా నారాధింపవలయును. మరియు నింటియందు శుభంబగు ఒక ప్రదేశమున ధాన్యరాశిలో పూర్ణకుంభము నుంచి, ఇరువదియొక్క సూత్రములచేత కప్పియుంచి, నవరత్నములు గాని శక్తికొలది సువర్ణమును పిలిపించి పాదప్రక్షాళనాది కృత్యము లాచరించి కూర్చుండ నియోగించి, అచట ఆ కేదార దేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగరు కస్తూరి కుంకుమాదులను, శ్రీగంధమును, నానావిధ పుష్పములను తాంబూలములను వస్త్రములనుంచి నివేదన మొనరించి, యథాశాస్త్రముగ ధూపదీపాదులచే నర్చించి, ఏకవింశతి సంఖ్యాకంబులయిన చోప్యాలే హ్యాదులను కదలీ పనసామాద్రి ఫలములను నైవేద్యముజేసి, తాంబూలము లొసంగి, చక్కగా స్తోత్రముజేసి, బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలిచ్చి వ్రతమును లెస్సగా ననుష్ఠించి ఈశ్వరునకు మనస్సంతుష్టి చేసినయెడల, యా వృషభధ్వజుండు ప్రీతుండై “నీవు కోరిన వరము లియ్యగలడు” అని వచించిన నా కాత్యాయినియు నటులేయగుగాక! యని ఆచరించెను.
అంత పరమశివుండు సంతుష్టాంతరంగుడై అచటికి దేవగణముల తోడం జని “నా శరీరార్ధమును నీకు ఇచ్చెద” నని ఇవ్వగా, నా పార్వతీదేవి యుప్పొంగి శంకర దేహార్ధమును బొంది లోకానుగ్రహము జేయదలంచి దన పతియగు పరమశివునితో “నీవ్రతము నాచరించువారలకు సకలాభీష్టసిద్ధి గలుగునటుల అనుగ్రహించితిరేని ఎల్లవారు నాచరింతు” రనగా, నటులే యగుగాక యని అంగీకరించి శివుడు సురసంఘములతో కూడ నచ్చట నంతర్హితుండయ్యె.
మరి కొంతకాలమునకు శివభక్తి యుక్తుండగు చిత్రాంగదుండను గంధర్వుండు నందికేశ్వరుని వలన నావ్రతచర్యా క్రమంబెరిగి మనుష్య లోకమునకుంజని వారలకు ఉపదేశింప వలయునని నిచ్చగలవాడై యుజ్జయినీ పట్టణమును జేరి వజ్రదంతుడను రాజునకు ఆ వ్రతమును ఉపదేశింప, అతడు ఆ వ్రతమును కల్పోక్తప్రకారంబుగ నాచరించి సార్వభౌముండాయెను.
మరికొంత కాలమునకు నా పట్టణమున నున్న వైశ్యునకు పుణ్యవతియు, భాగ్యవతియు నను నిరువురు కుమార్తెలు గలిగిరి. వారిద్దరును తండ్రిద్దగ్గరకు బోయి కేదార వ్రతమాచరించుట కానతియుమని వేడగా నతడు “అమ్మా! నేను మిగుల దరిద్రుడను. మీరా తలంపు మాను”డనగా “ఓ తండ్రీ! నీయనుజ్ఞయే మాకు పరమధనంబుగాన ఆనతియు”మని సెలవు పుచ్చుకొని ఒక వటవృక్షమువద్ద కూర్చుండి ప్రతిసరము గట్టికొని యథావిధిగా పూజింప వారల భక్తికి మెచ్చి ఈశ్వరుడు వలయు సామగ్రిని ఇచ్చెను.
అంతట వారలు చక్కగా వ్రతము నాచరించుట వలన ఆ మహాదేవుండు ప్రీతుండయి ఆ కన్యలకు ఆయురారోగ్య ఐశ్వర్యములను, దివ్యరూపంబుల నొసంగి అంతర్ధానుండాయెను.
పిమ్మట నా వ్రత మాహాత్మ్యము వలన నుజ్జయినీ పట్టణమును నేలుచున్న రాజు పుణ్యవతియను కన్యను, చోళ భూపాలుడు భాగ్యవతియను కన్యను పాణిగ్రహణం బొనర్చికొనిరి. అందువలన నావైశ్యుండు ధనసమృద్ధి గలిగి సామ్రాజ్య సంపదలను, పుత్రులను బొంది సుఖమున నుండెను.
కొన్నినాళ్లపిదప – రెండవదియైన భాగ్యవతి అనునది ఐశ్వర్య మదమోహితురాలై కొంత కాలమునకు నా వ్రతమును విడిచెను. అందువలన భాగ్యహీనురాలై పుత్రుని తోడ పెనిమిటిచేత వెడలనంపబడి అడవిలో తిరిగి సంచారఖిన్నురాలై ఒకబోయవాని యిల్లు చేరెను. అచ్చట పుత్రుని జూచి “నాయనా! నా అక్కయగు పుణ్యవతిని ఉజ్జయినీ పురపు రాజు వివాహమాడి యున్నవాడు. నీ వచ్చటికిపోయి మన సంగతి నెటింగించి బ్రతుకు తెరువునకై తగినంత ధనము తీసికొని శీఘ్రముగా రమ్మనగా నతండు ఆ పట్టణమునకు పోయి పెద్ద తల్లితో తన తల్లియొక్క దుస్సహంబగు కష్టమును దెలుపగా నా పుణ్యవతియు నతని చేతికి విస్తారముగ ధనము నిచ్చెను.
అంత నాతడా ధనమును తీసికొని వచ్చుచుండగా, మార్గమున నదృశ్యరూపుండైన ఆ దేవుని వలన నాధనం బపహరింప బడగా, నతడు మరల పెదతల్లి కడకేతెంచి ఆ వృత్తాంతమును విన్నవించి మరికొంత ధనము సంగ్రహించుకొని వచ్చెను. ఆ ధనము గూడా హరింపబడగా దోదూయమానసుండై నిలువంబడియున్న వానితో ఈశ్వరుం డదృశ్యుండై “ఓ చిన్నవాడా! వ్రతభ్రష్టులకు నీధనంబు గ్రహింప నలవికాని” దని చెప్పెను. ఆ మాటలు విని విస్మయంబంది, ఆ చిన్నవాడు మరల ముందువలెనే ఉజ్జయినీ పట్టణమునకుం జని ఈశ్వరోక్తంబగు వృత్తాంతమును పెదతల్లికి దెలుపగా నా పుణ్య వతి ఆలోచించి పుత్రునిచేత కేదార వ్రతంబు నాచరింపజేసి తన చెల్లెలు కూడ వ్రత మాచరించు నటుల చెప్పవలయునని చెప్పి, ధనము నొసంగి పంపెను.
అతండు బయలుదేరి వచ్చునెడ మార్గంబున నప్రయత్నముగ ముందు గోలుపోయిన ధనమంతయు స్వాధీనమైనందున సంతోషించి, సర్వమునూ గ్రహించుకుని కాంచీపట్టణము ప్రవేశించు సమయంబున చతురంగ బలములతోడ అతని తండ్రి ఎదుర్కోలుగా వచ్చి, ఆ బాలుని అతని తల్లినీ కూడా వెంట బెట్టుకొని తన పట్టణమునకుం జనియె. అంతట నా రాకుమారుడు తలిదండ్రులతో గూడి సుఖముగా నుండెను.
పిమ్మట తల్లియగు భాగ్యవతియును తండ్రియగు చోళరాజును నదిమొదలు ఈ వ్రతము నాచరించుచు అవిచ్ఛిన్నంబగు సకల సంపద లనుభవించుచుండిరి.
ఎవరైనను యథోక్తప్రకారము నీవ్రతమాహాత్మ్యమును భక్తియుక్తులై వినిన, జదివిన అట్టివారలందరును శ్రీమహాదేవుని అనుగ్రహముచేత ననంతంబులగు ఆయురారోగ్య ఐశ్వర్యంబులను బొంది సుఖంబు లనుభవించి శివసాయుజ్యమును బొందుదురని గౌతమమహాఋషిచే జెప్పబడెనని సూతుండు శౌనకాదులకు జెప్పినట్లుగా
శ్రీవ్యాసభట్టారకుడు స్కాంద పురాణమునం దభివర్ణించెను.
కేదారేశ్వర వ్రతకథ సమాప్తము.
ఓం నమః శివాయ
